Intinti Gruhalakshmi July 12 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో సాక్షి, వసుధార లకు బోనం చేయడానికి రాకపోయేసరికి తులసి వారి దగ్గరికి వెళ్లి బోనం ఎలా చేయాలో చెబుతుంది. అంతేకాకుండా ఉపవాసంతో బోనం ఎత్తుకునే వారికి కళ్ళు తిరుగుతున్న సమయంలో పసుపు నీళ్లు చల్లాలి అంటూ సలహాలు ఇచ్చి అక్కడ నుంచి వెళ్తుంది.
సీన్ కట్ చేస్తే..
లాస్య రంగంలోకి దిగుతుంది. దాంతో నందు లోపలికి వెళ్లే ముందు ఆలోచించుకో అని లాస్యతో అంటాడు. కానీ లాస్య నందుతో వెటకారంగా మాట్లాడటం తనతో అక్కడి నుంచి లోపలికి వెళ్తాడు. కానీ లాస్య మాత్రం పక్కనే ఉన్న భాగ్యతో ఇక్కడికి తులసి బోనం సమర్పించకూడకుండా చేయడానికి వచ్చాను అని.. అనటంతో ఆ పని నేను చూసుకుంటాను అని భాగ్య అంటుంది.
ఆ తర్వాత నందు వచ్చి పిలవటంతో.. ఇద్దరు లోపలికి వెళ్తారు. ఇక తులసి వాళ్ళు బోనం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో తులసి తన కుటుంబాన్ని చూసి ఎప్పుడు ఇలాగే ఉండాలి అని కోరుకుంటుంది. ఇక అప్పుడే అక్కడికి నందు దంపతులు రావడంతో వారి వైపు కోపంగా చూస్తుంటారు. లాస్య వారికి ఎదురుగా కూర్చుని భోనం తయారు చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన మాటలతో తులసి కుటుంబాన్ని రెచ్చగొడుతుంది.
కానీ అనసూయ మాత్రం తిరిగి గట్టి కౌంటర్ వేస్తూ ఉంటుంది. ఆ తర్వాత తులసి బోనంకుండలను అడగటంతో దివ్య తాను తీసుకొస్తాను అని అంటుంది. ఇక తులసి వాటిని జాగ్రత్తగా తీసుకొని రమ్మని అంటుంది. వెంటనే లాస్య భాగ్యతో ఒక ప్లాన్ చెబుతుంది. ఇక దివ్య బోనం కుండ పట్టుకొని వస్తూ అక్కడ మోగుతున్న డప్పుల శబ్దాలకు వెళ్లి తాను డాన్స్ చేస్తుంది.
తులసి బోనం కుండలను పగిలేలా చేసిన లాస్య..
భాగ్య కూడా అక్కడికి వెళ్లి మొత్తానికి కుండలను కింద పడేసేలా చేస్తుంది. అందరూ అక్కడికి వెళ్ళగా.. ఏం తప్పు చేసారో అందుకే అలా జరిగింది అని అందరూ అంటుంటారు. పైగా లాస్య కూడా రెండు మూడు మాటలు అంటూ ఉంటుంది. ఇక అదే సమయంలో మాధవి ముందుగానే తను తులసి గిఫ్ట్ ఇవ్వాలనుకున్న కుండలను తెచ్చి ఇవ్వటంతో తులసి సంతోషపడుతుంది.
మరో ప్లాన్ చేసిన లాస్య..
మరోవైపు లాస్య, భాగ్య తమ ప్లాన్స్ సక్సెస్ కాకపోవటంతో ఇద్దరు నిరాశ చెందుతారు. ఆ తర్వాత లాస్య తన దగ్గర మరో ప్లాన్ ఉంది అని తులసి కోసం నిద్ర టాబ్లెట్లు తీసుకుని వస్తుంది. ఇక ఆ టాబ్లెట్లను తులసితో ఎలా వేయించాలా అని లాస్య భాగ్య తో మరో ప్లాన్ చెబుతుంది. ఆ తర్వాత లాస్య తన ప్లాన్ సక్సెస్ అయ్యింది అని పగటి కలలు కంటూ ఉంటుంది.
మరోవైపు వసు, సాక్షి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఆ తర్వాత అందరూ తెగ డాన్సులు చేస్తారు. ఆ సమయంలో భాగ్య తన పని పూర్తి చేసుకుంటుంది. ఇక ఆ తర్వాత అక్కడ రెండు కుటుంబాల డ్రామా మొత్తం బయటపడటంతో వసు కు వాళ్ళ స్టోరీ ఏంటో తెలిసిపోతుంది. పైగా ఇంటి కోడలితో బోనం ఎక్కించాలి అని లాస్య గొడవ చేయటంతో చివరికి న్యాయం పరంగా అది తులసికే చెందుతుంది.
తులసి జీవితంలోకి రానున్న కొత్త వ్యక్తి..
తరువాయి భాగంలో తులసి అమ్మవారికి బోనం సమర్పించగా.. అక్కడ అమ్మవారు వచ్చిన ఒక మహిళ తులసికి త్వరలో మంచి రోజులు వస్తాయి.. తమ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి వస్తున్నాడు అని అనగా మొత్తానికి ఒక కొత్త వ్యక్తిని చివరిలో చూపిస్తారు. దాంతో నందు కాస్త షాక్ అయినట్లు కనిపిస్తాడు. ఇక ఆ వ్యక్తి ఎవరు అనేది తరువాయి భాగంలో తెలుస్తుంది.