Intinti Gruhalakshmi July 2 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో భాగ్యతో తులసి వాళ్ళు బాగా ఆడుకుంటారు. భాగ్య తమ మాటలు వినేలా చేయాలి అని తమకు రంజిత్ అడ్రస్ తెలిసినట్టుగా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది తులసి. ఆ సమయంలో భాగ్య పడే తిప్పలు చూస్తే తెగ నవ్వొస్తుంది. ఇక తులసి వాళ్ళు భాగ్యను అలా చూస్తూ తాము బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తులసి ఒక అడ్రస్ చెప్పటంతో భాగ్య ఆ అడ్రెస్ సేవ్ చేసుకొని ఎలాగైనా ఈ విషయం లాస్యకి చెప్పాలి అని అనుకుంటుంది.
సీన్ కట్ చేస్తే..
లాస్య తెగ టెన్షన్ పడుతూ కనిపిస్తుంది. తులసి ఏం ప్లాన్ చేసిందో ఇప్పటివరకు భాగ్య చెప్పలేదు అని కోపంతో రగిలిపోతుంది. అప్పుడే భాగ్య ఫోన్ చేసి వెంటనే నీ చేతికున్న బంగారు గాజులు తీసేయు లాస్య.. మరి కాసేపట్లో పోలీసులు నీకు సంకెళ్లు వేస్తారు అని అంటుంది. దాంతో లాస్య భయపడుతూ ఏం జరిగింది అనటంతో.. తులసికి రంజిత్ అడ్రస్ తెలిసిపోయిందని చెబుతుంది.
ఇప్పుడు రంజిత్ ఇంటికి వెళ్లి అసలు నిజం తెలుసుకుంటే మన పని అవుతుంది అని అంతలోపే మనం అక్కడికి బయలుదేరాలి అని అంటుంది. అప్పుడే లాస్య దగ్గరికి నందు రావటంతో లాస్య భయపడుతూ కనిపిస్తుంది. ఏం జరిగింది అని నందు అనడంతో లాస్య నిజం చెప్పకుండా మాట మారుస్తూ మాట్లాడుతుంది.
శృతికి గుడ్ న్యూస్ చెప్పిన తులసి..
మరోవైపు తులసి అంకిత, దివ్యలతో ఇప్పుడు లాస్య పరిస్థితి ఇలా ఉంటుంది అని చెబుతుంది. జరగబోయేది చూడాలి అని అంతవరకు మీరు రెడీ అయి ఉండండి అంటూ.. తాను ఇంట్లోకి వెళ్తుంది. అక్కడ న్యూస్ పేపర్లో సంగీతం కాంపిటీషన్ లో పాల్గొంటే ఐదు లక్షలు బహుమతి ఉండటంతో వెంటనే ఆ విషయం శృతికి చెబుతుంది. దాంతో శృతి కూడా సంతోషపడుతుంది.
మరోవైపు ప్రేమ్ గిటార్ ప్లే చేస్తూ ఆలోచనలో పడతాడు. అప్పుడే తన మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి తనను మాటలతో అవమానిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ట్రాక్ గిటార్ ప్లే చేయాలని అనడంతో ప్రేమ్ ఎక్కడో ఆలోచన పెట్టి గిటార్ ప్లే చేస్తాడు. దాంతో ఆ మ్యూజిక్ డైరెక్టర్ ప్రేమ్ పై అరుస్తాడు. ఇక ఓవైపు లాస్య, భాగ్య స్కూటీ వేసుకుని రోడ్డుపై హడావిడిగా బయలుదేరుతారు.

Intinti Gruhalakshmi July 2 Today Episode: పరుగులు పెట్టిన లాస్య, భాగ్య..
వెనకాలే తులసి వాళ్ళు ఫాలో అవుతుంటారు. మధ్యలో భాగ్య వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత స్కూటీ మధ్యలో ట్రబుల్ ఇవ్వటంతో ఎలాగైనా రంజిత్ ఇంటికి వెళ్లాలి అని పరుగులు తీస్తారు. అది చూసి తులసి వాళ్ళు తెగ నవ్వుకుంటారు. తరువాయి భాగంలో తులసి చేతిలో వారిద్దరు బందీ అవుతారు. అంతేకాకుండా తులసి వారికి 24 గంటల్లోగా తన డబ్బులు తనకు అందివ్వకపోతే మరోలా ఉంటుంది అని వార్నింగ్ కూడా ఇస్తుంది. ఇక వారిని కిడ్నాప్ చేసే ప్లాన్ కూడా చేసినట్లు తెలుస్తుంది.