Intinti Gruhalakshmi July 4 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో తులసి వాళ్లు లాస్య, భాగ్యను ఫాలో అవుతారు. మొత్తానికి లాస్య, భాగ్య తులసి చెప్పిన అడ్రస్ కు వెళ్తారు. ఇక ఇద్దరు ఆ బంగ్లా ని చూసి భయపడి పోతారు. రంజిత్ ఇక్కడ ఎందుకు ఉంటాడు అని లాస్య అనుమానం పడటంతో.. పక్కనే ఉన్న భాగ్య సినిమాలలో మోసం చేసిన వాళ్ళు ఇలాగే దాచుకుంటారు కదా అని అనడంతో లాస్య అది ఒక పాయింటే అని లోపలికి బయలుదేరుతారు.
లాస్యకు దడ..
ఇక లోపల ఉన్న వాతావరణంను చూసి భయపడిపోతుంటారు. మధ్య మధ్యలో భాగ్య తన మాటలతో లాస్యకు మరింత దడ పుట్టిస్తుంది. ఇక వెనుకాల తులసి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. లాస్య వాళ్లు రంజిత్ కోసం మొత్తం వెతుకుతూ ఉంటారు. అప్పుడే దివ్య భయంకరంగా సౌండ్ చేయటంతో ఇద్దరు వణికిపోతారు. భాగ్య ఇక్కడి దయ్యం ఉంది అని భయపెట్టిస్తూ ఉంటుంది.
లాస్యను మరింత భయపెట్టిస్తున్న తులసి..
ఆ తర్వాత తులసి వాళ్ళు మరింత భయం పెట్టించాలి అని తమ సౌండ్ లతో మరింత వణుకు పుట్టిస్తుంటారు. ఇక ఆ గొంతులకు భయపడి భాగ్య బతుకుంటే పోలీస్ స్టేషన్లోనైనా ఏదో కూడు తిని ఉంటాము అని.. ఇక్కడ ఉంటే ఇదే చివరి రోజు అవుతుంది అని అనటంతో. అక్కడ మరింత భయంగా అనిపించడంతో లాస్య కూడా అక్కడ నుంచి బయటపడాలని అనుకుంటుంది. ఇక భాగ్యతో భయపడుతున్నావు కాబట్టి వెళ్దాము అని బయలుదేరుతుండగా అప్పుడు తులసి వాళ్ళు ఎంట్రీ ఇస్తారు.
వాళ్ళని చూసి లాస్య షాక్ అవ్వగా భాగ్య దయ్యాలు కావు అని ధైర్యంగా ఉంటుంది. తర్వాత తులసి మిమ్మల్ని ఫాలో అవుతున్నాము అని.. మీ రంజిత్ దొరికాడా అని అనటంతో లాస్య ఏం తెలియనట్లుగా నటిస్తుంది. ఆ తర్వాత తులసి నిజం చెప్పటంతో లాస్యకు ఏమి అర్థం కాకుండా మైండ్ బ్లాక్ అవుతుంది. ఇక డబ్బులు ఇవ్వకపోతే నేరుగా మీ భర్త నందు దగ్గరికి వెళ్లి నిజం చెబుతాను అని.. లేదంటే 24 గంటల్లో డబ్బులు అందివ్వాలి అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.
నందుకి నిజం చెప్పిన లాస్య..
మరోవైపు శృతి ప్రేమ్ కు మ్యూజిక్ కాంపిటీషన్ గురించి చెప్పటంతో ప్రేమ్ దానికి అంతగా ఆసక్తి చూపడు. ఓ వైపు నందు లాస్య కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఇక లాస్య, భాగ్య అప్పుడే రాగా లాస్య ఏమి చేయలేక నందుకి అసలు నిజం చెప్పేస్తుంది. తను ఒక బ్రోకర్ వల్ల తులసి అకౌంట్లో డబ్బులు వేయించాను అని.. ఆ తర్వాత ఆ డబ్బులు తీసి నీ బిజినెస్ కి ఇచ్చాను అని ఇప్పుడు ఆ డబ్బులు కావాలి అంటూ తులసి వార్నింగ్ ఇచ్చింది అని అంటుంది.

Intinti Gruhalakshmi July 4 Today Episode: ఇక మనం కలిసి ఉండేది లేదు అంటూ నందు షాక్..
తరువాయి భాగంలో తులసి లాస్య కి ఫోన్ చేసి డబ్బులు పడ్డాయని చెబుతుంది. ఇక తను ఆ డబ్బులు వెయ్యలేదు అని అనుకోగా అప్పుడే నందు వచ్చి ఆ డబ్బులు నేనే వేశాను అని.. నువ్వు చీటర్ ఇక నీ ముఖం నాకు చూపించవద్దు అంటూ మనం కలిసి ఉండేది లేదు అంటూ షాక్ ఇస్తాడు.