Intinti Gruhalakshmi July 5 Episode: ఈరోజు ఎపిసోడ్ లో లాస్య నందుతో తులసిని మోసం చేసి ఆ డబ్బులు నీ పెట్టుబడి కోసం అందించాను అని అనటంతో వెంటనే నందు కోపంతో రగిలిపోయి తులసిని మోసం చేసి ఆ డబ్బులు నాకు ఇస్తావా అంటూ చెంప పగలగొడతాడు. దాంతో లాస్య షాక్ అవ్వగా.. అదంతా ఊహా అని అనుకుంటుంది. ఇక అప్పుడే నందు బయటకి వెళ్దాం అనటంతో.. తను రాను అని నువ్వు ఒక్కడివి వెళ్లి ఎంజాయ్ చేసి రా అని అంటుంది. ఇక నందు అక్కడ్నుంచి వెళ్తాడు.
ఆ తర్వాత లాస్య భాగ్యతో తులసి ఇచ్చిన గడువు పూర్తయ్యేలోగా తులసి అకౌంట్ లో డబ్బులు వేయాలి అని ఆలోచన పడుతుంది. వెంటనే భాగ్య బావగారికి నిజం చెబితే సరిపోయేది కదా అనడంతో.. అప్పుడు నా చెంప పగలగొట్టి నా కాపురం ముక్కలయ్యేది అని అంటుంది. ఇప్పటికిప్పుడు 20 లక్షలు ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు అని అనటంతో వెంటనే లాస్య నువ్వే ఇవ్వాలి అంటూ.. గతంలో తులసి ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా దానికి ఇంట్రెస్ట్ గా ఇస్తాను అనటంతో.. వెంటనే భాగ్య నా దగ్గర డబ్బులు లేవని అప్పులు కట్టేశాను అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకుంటుంది. దాంతో లాస్య భాగ్యపై కోప్పడుతుంది.
సీన్ కట్ చేస్తే..
తులసి దివ్య తో చెస్ ఆడుకుంటూ ఉంటుంది. ఇక దివ్య.. మామ్ లాస్య ఆంటీతో ఆడుకోవడం అయిపోయిందా అనటంతో తులసి మనం చేసేది ఏమీ లేదు అని.. ఇప్పుడు మొత్తం లాస్య డబ్బు కోసమే తిరుగుతూ ఉంటుంది అని అంటుంది. అన్నట్టుగానే లాస్య అందరి దగ్గర డబ్బులు అడగటానికి ప్రయత్నిస్తుంది.
తులసి అకౌంట్లో డబ్బులు వేసిన నందు..
ఆ తర్వాత తులసి అకౌంట్ కి 20 లక్షలు పడ్డాయని మెసేజ్ రావటంతో.. వెంటనే తులసి లాస్య కి ఫోన్ చేసి చెబుతుంది. లాస్య తను వెయ్యకుండా మరెవరు డబ్బులు వేశారు అని ఆలోచిస్తుంది. తులసి ఫోన్ కట్ చేశాక ఆ విషయం గురించి ఆలోచిస్తుంది లాస్య. అప్పుడే నందు వచ్చి ఆ డబ్బులు నేనే వేశాను అంటూ గట్టి షాక్ ఇస్తాడు. తులసిని మోసం చేసి డబ్బులు ఎలా ఇచ్చావ్ అని నువ్వు చీటర్ నువ్వు, నేను కలిసి ఉండేది లేదు అని లాస్యను వదిలేయాలి అని ఫిక్స్ అవుతాడు.

Intinti Gruhalakshmi July 5 Episode: హై డ్రామా క్రియేట్ చేసిన లాస్య..
ఇక లాస్య తులసికి ఫోన్ చేసి ఎందుకు నిజం చెప్పావు అని అంటుంది. తులసి తాను నిజం చెప్పలేదు అనటంతో ఆ తర్వాత సంజన ఫోన్ చేసి నిజం చెబుతుంది. ఇక సంజన ద్వారా నిజం తెలిసింది అనుకోని నందుని ఇంట్లో నుంచి బయటికి పంపించకుండా పాయిజన్ తాగుతున్నట్లుగా హైడ్రామా క్రియేట్ చేస్తుంది. అంతేకాకుండా ఇదంతా నందు కోసం చేశాను అని నందుకు వినిపించేలా అనడంతో నందు కూల్ అయ్యి తనను దగ్గరికి తీసుకుంటాడు.