Intinti Gruhalakshmi July 9 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో భాగ్య లాస్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటుంది. అప్పుడే లాస్య వచ్చి ఎక్కడికి వెళ్ళలేదు అంటూ నందుని తులసి తో పాటు ప్రేమ్ కూడా అవమానపాలు చేశాడు.
కాబట్టి ప్రేమ్ ను గెలవనివ్వకుండా చేస్తాను అని అనడంతో వెంటనే భాగ్య మొన్ననే చెంప దెబ్బ కొట్టించుకున్నావు మళ్ళీ తులసి జోలికి వెళ్లడం అవసరమా అని అంటుంది. దాంతో లాస్య ఇవన్నీ పట్టించుకోకుండా ఎలాగైనా ప్రేమ్ ను ఓడించాలని ఒక సిరప్ పట్టుకొని వస్తుంది. అది తాగుతే ప్రేమ్ కు దగ్గు వస్తుంది అని పాట పాడకుండా ఓడిపోతాడు అని అంటుంది. దాంతో భాగ్య భయపడుతూ ఉంటుంది.
సీన్ కట్ చేస్తే..
ప్రోగ్రాం ప్రారంభం అవుతుంది. ఇక యాంకర్ ప్రోగ్రాం గురించి వివరిస్తూ ఉంటుంది. మరోవైపు సింగర్స్ అంతా ఒకచోట కూర్చుంటారు. ఇక లాస్య తాను తెచ్చిన సిరప్ మందును జ్యూస్ లో కలిపి అది ప్రేమ్ ను తాగించేలా చేస్తుంది. మొత్తానికి ప్రేమ్ జ్యూస్ తాగుతాడు. ఆ తర్వాత సింగర్స్ అందర్నీ ప్రోగ్రాంలోకి పిలుస్తారు.
ఇక ప్రేమ్ కు తన కుటుంబ సభ్యుల ఆల్ ది బెస్ట్ చెబుతారు. లాస్య మాత్రం జరగబోయే పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని తెగ సంతోషపడుతుంది. ఇక పాట పాడటానికి మొదట ఒక వ్యక్తి వచ్చి పాట పాడుతాడు. ఇక వ్యక్తి పాటకు అందరూ ఫిదా అవుతారు. వెంటనే నందు అతడే గెలుస్తాడు అని అంటాడు కూడా. ఆ తర్వాత మరో అమ్మాయి పాడుతూ ఉంటుంది.
దగ్గుతో బాధపడుతున్న ప్రేమ్..
ఆ సమయంలో ప్రేమ్ కు దగ్గు రావడం ప్రారంభమవుతుంది. వెంటనే తులసి ప్రేమ్ దగ్గరికి వెళ్లి వేడి నీళ్లు తాగిస్తుంది. ఏం కాదు అని ధైర్యం ఇస్తుంది. అదంతా చూస్తున్న లాస్య ప్రేమ్ పని అయిపోయినట్లు తెగ మురిసిపోతుంది. ఆ తర్వాత ప్రేమ్ వెళ్లి పాట పాడటంతో అందరూ తెగ క్లాప్స్ కొడతారు.

Intinti Gruhalakshmi July 9 Today Episode: లాస్యకు ఎదురు దెబ్బ కొట్టిన తులసి..
ఇక ఫైనల్ రౌండ్ లో ప్రేమ్ పేరు తో మరో వ్యక్తి పేరు కూడా ఉంటుంది. ఆ సమయంలో లాస్య కు దగ్గు రావడంతో ఇబ్బంది పడుతూ బయటికి వెళ్తుంది. అది చూసిన తులసి లాస్య దగ్గరికి వెళ్లి ఆ జ్యూస్ తాగింది నువ్వే అని.. తాగేలా చేసింది నేనే అని తను చేసిన ప్లాన్ మొత్తం చెబుతుంది. ఇక ఆ తర్వాత తనే తులసి ఆకులు ఇచ్చి నయం చేస్తుంది.
ఇక ప్రేమ్ కు తులసి ధైర్యం చెబుతూ ఉంటుంది. లాస్య మాత్రం మరో వ్యక్తికి ఓట్లు వేయమని ప్రచారం చేస్తుంది. ఆ తర్వాత ప్రేమ్ వేదిక మీదకి వెళ్లి అద్భుతంగా పాట పాడటంతో అందరిని ఫిదా చేస్తాడు. వచ్చిన ఆడియన్స్ ను ఓటింగులు వేయమని అనగా ఒక ఓటింగ్ తేడాతో గెలిచిన వ్యక్తి పేరు చెప్పబోతారు.