Intinti Gruhalakshmi June 1 Episode: ఈరోజు ఎపిసోడ్ లో లాస్య, నందు గాయత్రి వాళ్ళ ఇంటికి రావటంతో గాయత్రి వాళ్లను సంతోషంగా పలకరిస్తుంది. ఇక వారు మాట్లాడుతూ ఉండగా అప్పుడే అంకిత, అభి వాళ్లు కూడా వస్తారు. వెంటనే అంకిత లాస్య దగ్గరికి వెళ్లి పలుకరిస్తుంది. ఇక లాస్య అంకితకు తెచ్చిన చీరను గిఫ్ట్ గా ఇస్తుంది. అది చూసి గాయత్రి ఈ చీర బాగుంది అని కేక్ కట్ చేసేటప్పుడు ఇదే కట్టుకో అని అంటుంది.
ఫైర్ లో ఉన్న లాస్య..
అప్పుడే అక్కడకు పరంధామయ్య దంపతులతో పాటు తులసి, దివ్య అక్కడికి వస్తారు. అదే సమయంలో ప్రేమ్, శృతి కూడా వస్తారు. ఇక అందర్నీ చూసి గాయత్రి, లాస్య దంపతులు ఓ రేంజ్ లో కోపంతో ఫైర్ అవుతూ కనిపిస్తారు. వాళ్లని ఇక్కడికి ఎందుకు పిలిచావు అని లాస్య గాయత్రిని, నందు ని గట్టిగా అడుగుతుంది. కానీ మేము పిలువ లేదు అని వాళ్లు అంటారు. ఇక లాస్య గాయత్రి తో అక్కడికి వెళ్లి వాళ్లని లోపలికి రానివ్వకుండా చేయమంటుంది.
ఇక గాయత్రి వాళ్ల దగ్గరికి వెళ్లి తులసితో ఎందుకు వచ్చావు అని గట్టిగా నిలదీయడంతో.. ఎందుకు రావద్దు అని తులసి కూడా అంతే గట్టిగా చెబుతోంది. ఇక పరంధామయ్య ఇటువంటి అవమానం ఎదురవుతుందని ముందే ఊహించాను అని పద ఇంటికి వెళ్దాం అని అనటంతో ఇప్పుడే అక్కడికి అంకిత వచ్చి తులసిని పట్టుకుంటుంది.
అది చూసి లాస్య వాళ్లు జీర్ణించుకోలేకపోతారు. ఇక అంకితకు అందరూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ సరదాగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే గాయత్రి అంకితను పక్కకు తీసుకొని వెళ్లి ఈ పార్టీకి వాళ్ళని ఎందుకు పిలిచావు అంటూ అవమాన పరుస్తుంది. అప్పుడే తులసి అక్కడికి వచ్చి ఏమో అంటున్నారు అని గాయత్రిని అడుగుతుంది. ఇక గాయత్రి వారిని వెళ్ళిపో అనటంతో.. వారిని పంపిస్తే నేను ఈ బర్త్డే పార్టీ చేసుకోను అని అంకిత అంటుంది.
తులసి తెచ్చిన చీరకు ఫిదా అయిన అంకిత..
అప్పుడే లాస్య అవన్నీ ఎందుకులే అంటూ ఉండనివ్వు అని అంటుంది. ఇక అంకిత తులసి తో తనకు ఏం గిఫ్ట్ తీసుకొచ్చావు అనటంతో.. వెంటనే తులసి చీర ఇస్తుంది. ఆ చీర చూసి అంకిత ఎంతో ఇష్టంగా తీసుకుంటుంది. కేక్ కట్ చేసేటప్పుడు ఈ చీర కట్టుకుంటాను అంటుంది. ఆ చీరను చూసి గాయత్రి ఘోరంగా అవమానిస్తుంది.

Intinti Gruhalakshmi June 1 Episode: ప్రేమ్ కు అవమానం..
ఆ తర్వాత లాస్య తన చీర కట్టుకోవడం లేదు అని రగిలి పోతూ ఉండగా గాయత్రి నేను కట్టుకునేలా చేస్తాను అంటుంది. ఇక తులసి అభి, ప్రేమ్ లను చూసి మురిసి పోతుంది. అప్పుడే అక్కడికి శృతి వచ్చి ప్రేమ్ పరిస్థితి గురించి చెప్పటం తో తులసి జీవితంలో కష్టాలు ఉంటాయని వాటికి మార్గం మనమే చూసుకోవాలి అని అంటుంది. ఆ తర్వాత నందు అభి ని పిలిచి డాక్టర్ అని చెప్పి పొగుడుతూ ఉంటాడు. అని అక్కడే ఉన్న ప్రేమ్ ను పిలువకపోయేసరికి ప్రేమ్ కు ఘోరంగా అవమానం జరిగినట్లు కనబడుతుంది.