Intinti Gruhalakshmi June 16 Episode: ఈరోజు ఎపిసోడ్ లో లక్కీ వెళ్ళి తులసి వాళ్లతో కలిసి ఆడుకుంటూ ఉండగా అప్పుడు నందు ఎలా అయినా లక్కీ ని తీసుకొని వెళ్ళాలి లేకపోతే లాస్య మళ్ళీ గొడవ చేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి అభి, అంకిత, ప్రేమ్, శృతి లు వస్తారు. అందరూ ఒకచోట కలవడంతో తులసి ఆనంద పడుతూ ఉంటుంది. కుటుంబం అందరూ ఒకచోట కలిసినందుకుఅందరూ ఆనంద పడుతూ ఉంటారు.
సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన లాస్య..
కుటుంబం అందరు ఒకచోట కలవడం చూసిన లాస్య ఎక్కడ వచ్చి గొడవ చేస్తుందో అని నందు టెన్షన్ పడుతూ ఉండగానే ఇంతలో అక్కడికి లాస్య వస్తుంది. ఇంతలోనే లాస్య ఫోన్ చేసి నువ్వు అక్కడే ఉండు వస్తున్నాను అనడంతో నందు తెగ టెన్షన్ పడతాడు. అనుకున్న విధంగానే లాస్య అక్కడికి వస్తుంది. అక్కడ తులసి చిన్నపిల్లల గేమ్స్ ఆడుతూ ఉంటుంది. ఇంతలో లాస్య అక్కడికి వచ్చి లక్కీ అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు నందు తెగ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు కోపంగా వెళ్ళి లక్కీని తనతో పాటు తీసుకెళ్తుంది.
నందు లాస్య పై మండిపడిన అనసూయ..
రామేశ్వరం పోయినా శనేశ్వరం పోదు అంటే ఇదే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు తలనొప్పిలా ఎక్కడికి వెళ్ళిన వస్తున్నారు అని అనసూయ కోప్పడుతుంది. అప్పుడు లాస్య ఎవరిని అంటున్నారు అంటూ అనసూయ పై విరుచుకు పడుతుంది. ఆ తర్వాత లాస్య నందు పై విరుచుకు పడటంతో నందు అనసూయకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇక మధ్యలో పరంధామయ్య ఎంటర్ అయ్యి నందు కి స్ట్రాంగ్ గా బుద్ధి చెబుతాడు. అప్పుడు తులసి పరందామయ్య ని సైలెంట్ గా ఉండమని చెబుతుంది.
అప్పుడు లాస్య నందు,లక్కీ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లి పోతుంది. అప్పుడు కుటుంబం మొత్తం భోజనం చేయడానికి వెళ్తారు. ఆ తర్వాత లాస్య నందు పై కోప్పడుతూ ఉండగా మధ్యలో లక్కీ మాట్లాడడంతో లక్కీ నోరు మూసుకో అని చెబుతుంది. ఇంతలో అభి మధ్యలో కలుగజేసుకొని ఇందులో డాడ్ తప్పు ఏమీ లేదు లాస్య కు చెబుతాడు. మా ఫ్యామిలీ అందులో అనుకోకుండా కలిశారు అని అంటాడు. ఆ తర్వాత కాశ్మీర్ ట్రిప్ కోసం ఐదుగురిని సెలెక్ట్ చేస్తారు.

Intinti Gruhalakshmi June 16 Episode: లాస్యకు అవమానం..
ఆ కాశ్మీర్ ట్రిప్పులో తప్పకుండా తన పేరు వస్తుంది అని లాస్య ఓవర్ ఎక్సట్ అవుతుంది. అప్పుడు లక్కీ వెళ్లి అందులో నుంచి ఒక చీటి బయటికి తీయగా అందులో నందు పేరు రావడంతో అందరూ సంతోషం పడుతారు. ఆ తర్వాత అభి పేరు,ఆ తరువాత దివ్య పేరు వస్తుంది. ఆ తర్వాత ప్రేమ్ పేరు వస్తుంది. ఇక చివరగా తులసి పేరు వస్తుంది. దీంతో అందరూ ఆనంద పడుతూ ఉంటారు. ఇక తరువాయి భాగంలో అభి తన తండ్రి కోసం ఐదు లక్షల అడిగాను అని అనగా అంకిత నీ మైండ్ సెట్ ఇంకా మారలేదు అన్నమాట అని అభి చేతిలో లో ఉన్న చెక్కును తీసుకుని తులసి ఇంటికి లగే జ్ సర్దుకుని వెళ్ళి పోతుంది.