Intinti Gruhalakshmi June 22 Episode: ఈరోజు ఎపిసోడ్ లో అభి తులసిని అన్న మాటలను అంకిత తట్టుకోలేక అభి పై గట్టిగా అరుస్తుంది. నువ్వు అన్ని మాటలు అన్నా కూడా ఆంటీ ఏం అనకుండా ఉంది అంటే ఆంటీ గొప్పతనం ఏంటో తెలీదా అంటూ ప్రశ్నిస్తుంది. అంతే కాకుండా మరో తులసిలా తయారు చేస్తుంది అని అంటున్నారు కదా అలా అయితే అంతకంటే అదృష్టం మరొకటి లేదు అని అంటుంది.
తన మామను మధ్యలోకి లాగిన అంకిత..
అలా అని నువ్వు నందగోపాల లాగా చేస్తే మాత్రం తులసి ఆంటీ లాగా చూసి ఊరుకోను అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. తులసి ఆంటీ అన్న మాటల స్థానంలో నేను ఉంటే నీ చెంప పగలగొట్టే దాని అని ఇక్కడి నుంచి వెళ్ళిపొండి అని వారందరికీ దండం పెట్టి పంపిస్తుంది అంకిత. ఆ తర్వాత తులసి తట్టుకోలేక చాలా బాధపడుతుంది.
నిజంగా నేను చేసిన దాంట్లో తప్పు ఉందా అని అంటుంది. అభి అనని మాటలు అంటున్నాడు అని ఆ మాటలు తట్టుకోలేకపోతున్నాను అని బాధ పడటంతో అందరూ ఓదార్చే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత అంకిత కూడా బాగా ఎమోషనల్ అవుతూ.. అంతా నా వల్లే జరిగింది ఆంటీ అని బాధపడుతూ ఉంటుంది. దాంతో తులసి అలా కాదు అంటూ తనను దగ్గరకు తీసుకుంటుంది.
సీన్ కట్ చేస్తే..
శృతి పాటలు వింటూ బట్టలు కుడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ప్రేమ్ వచ్చి చిరాకు పడుతూ ఆ పాటలను ఆఫ్ చేస్తాడు. శృతి బయట చిరాకులను ఇంటికి తీసుకుని రావద్దు అనటంతో.. ప్రేమ్ బయట విషయాలు కాదు అంటూ.. అభి గురించి అంటూ మండిపోతాడు. అంకిత ఇంట్లో గొడవ పడి మామ్ దగ్గరికి వచ్చింది అని.. వారంతా మామ్ పై తప్పు పడుతున్నారు అని అంటాడు.
దాంతో శృతి.. అంకిత గొడవ పడడానికి కారణం తాను డబ్బులు అడిగినందుకు ఏమో అని బాధపడుతుంది. ప్రేమ్ మాత్రం ఎలాగైనా అభిని అడుగుతాను అని.. అనవసరంగా మామ్ ను బ్లేమ్ చేస్తున్నారు అని బాధపడతాడు. శృతి మాత్రం అంకితకు ఫోన్ చేసి అసలు విషయం తెలుసుకుందాము అని అనుకుంటుంది. మళ్లీ డబ్బుల కోసం ఫోన్ చేసింది అని కంగారు పడుతుందేమో అని చేయొద్దులే అనుకుంటుంది.

Intinti Gruhalakshmi June 22 Episode: తులసికి కొత్త కష్టం తెచ్చిపెట్టిన లాస్య..
తులసి పాట పాడుతూ ఉండగా అక్కడికి అంకిత వచ్చి పొగుడుతుంది. వారిద్దరూ అలా మాట్లాడుతూ వుండగా అంకితకు శృతి ఫోన్ చేసి తన వల్లే ఇలా జరిగింది అంటూ ఇద్దరు తమ బాధలను అర్థం చేసుకుంటారు. అది చూసి తులసి మురిసిపోతుంది. ఇక నందు కంపెనీ పెట్టుబడి కోసం డబ్బు కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. లాస్య వచ్చి రెండు రోజుల్లో నీ చేతికి డబ్బు అందుతుంది అని అనటంతో నందు నమ్మకుండా వెళ్ళిపోతాడు. ఇక తన మనసులో తులసి ద్వారా 20 లక్షలు పెనాల్టి కట్టిస్తాను అని అనుకుంటుంది. అంటే తులసికి ఏదో కష్టం తెచ్చినట్లే కనిపిస్తుంది.