Intinti Gruhalakshmi June 3 Episode: ఈరోజు ఎపిసోడ్ గాయత్రి అభి, నందు దంపతులతో తులసిని ఎందుకు పిలిచారు అంటూ గొడవ పడుతూ ఉంటుంది. లాస్య కూడా తులసి పై విరుచుకు పడుతూనే ఉంటుంది. వాళ్ళు తులసిని అన్ని మాటలు అంటున్న కూడా పక్కనే ఉన్న అభి మాత్రం ఏమనలేకపోతాడు. ఆ మాటలు వింటున్న తులసి మాత్రం బాధతో కుంగిపోతుంది.
అవసరాల్లో ఉంది అంటూ తులసిని అవమానించిన గాయత్రి..
వెంటనే గాయత్రి అభితో తులసికి కోట్ల ఆస్తి వచ్చిన విషయం తెలియకూడదు అని లేదంటే సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది అని అంటుంది. అయినా కూడా అభి ఏమీ అనకపోవడంతో.. గాయత్రి అన్న మాటల కంటే.. అభి మౌనాన్నే తట్టుకోలేకపోయింది. లాస్య తెలియనట్టు ఆస్తులు ఏమిటి అనటంతో వారసత్వం ఆస్తులు అని అంటుంది. ఈ విషయం గానీ తులసికి తెలిస్తే అంతే సంగతి అని.. ఇప్పుడు తను అవసరాల్లో ఉంది అని అంటుంది.
ఇక లాస్య కూడా ఎలాగైనా తులసిని దూరం చేయాలి అని చూస్తుంది. దీంతో తులసి ఆ మాటలు తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్తుంది. ఇక అంకితకు తాము ఇంటికి వెళ్తున్నామని అనటంతో అంకిత భోజనం చేయకుండా ఎలా వెళ్తారు అని కాస్త మారం చేస్తుంది. అభి కూడా అలా ఎలా వెళ్తారు అని అనటంతో వెంటనే తులసి అభిని దెప్పి పొడిచేలా మాట్లాడుతుంది. ఇక అంకితను ఒక బహుమతి కూడా అడుగుతుంది తులసి.
అంకితను తన ఇంటికి రావద్దన్న తులసి..
ఇక పై మా ఇంటి గడప తోక్కొద్దు అని తులసి అంకితను అనడంతో అందరు షాక్ అవుతారు. కానీ లాస్య, గాయత్రి వాళ్ళు సంతోషంగా కనిపిస్తారు. ఎందుకు రావద్దంటున్నారు అని అంకిత అనటంతో తులసి నిజం చెప్పకుండా తనను అవాయిడ్ చేసి అక్కడి నుంచి తన ఫ్యామిలీతో వెళ్ళిపోతుంది. అంకిత బాగా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే అనసూయ తులసితో అంకితను ఎందుకు రావద్దంటున్నావు అని గట్టిగా అడుగుతుంది.
అందరినీ దూరం చేసుకుంటున్నావు అని అంటుంది. అప్పుడే పరంధామయ్య తులసి ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలియదు కానీ అక్కడ ఏదో జరిగింది కాబట్టి.. అంత ఇష్టంగా చూసుకునే అంకితను దూరం పెట్టింది అని అంటుంది. ఇక అనసూయ కూడా నీ దగ్గర నిజం రాబట్టడానికి అలా ప్రవర్తించాను అని.. ఇంతకు అసలేం జరిగింది అని అనటంతో వెంటనే తులసి జరిగిన విషయాలను చెబుతూ బాధపడుతుంది.

Intinti Gruhalakshmi June 3 Episode: బాగా ఎమోషనల్ తో మాట్లాడిన అంకిత..
ఆ మాటలు విని పరంధామయ్య దంపతులతో పాటు దివ్య కూడా బాధపడుతుంది. ఇక తులసి ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉండగా అంకిత పదే పదే ఫోన్ చేస్తుంది. కానీ తులసి ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలాగే ఉంటుంది. అప్పుడే దివ్య వచ్చి ఫోన్ లిఫ్ట్ చేయగా అంకిత బాగా ఎమోషనల్ గా మాట్లాడుతుంది. అది నా ఇల్లు అని.. మీరు నన్ను కాదనరని కానీ ఏదో విషయం వల్ల మీరు ఇలా ప్రవర్తించాను అని అదేంటో చెప్పండి అంటూ బ్రతిమాలుతుంది. ఇక తులసి ఆ విషయం చెబితే నువ్వు అక్కడ క్షణం ఉండలేవు అని అనుకుంటుంది.