Intinti Gruhalakshmi June 4 Episode: ఈరోజు ఎపిసోడ్ లో అంకిత తులసి ఫోన్ కి ఫోన్ చేసి బాగా ఎమోషనల్ గా మాట్లాడుతుంది. మీరు ఆ ఇంటికి వద్దంటే రాకుండా ఉండను అని.. వచ్చే అర్హత నాకు ఉంది అని.. అది నా ఇల్లు అని బాగా ఎమోషనల్ గా మాట్లాడి ఫోన్ కట్ చేస్తుంది. దాంతో తులసి బాధపడుతూ.. నీ భవిష్యత్తు గురించి నేను నిన్ను దూరం పెడుతున్నాను అని.. నాలా నీ పరిస్థితి కావద్దు అని అలా నిర్ణయం తీసుకున్నాను అంకిత అని బాధపడుతుంది.
సీన్ కట్ చేస్తే..
తులసి రోడ్డుపై వెళుతూ ఉండగా లాస్య ఎదురు పడుతుంది. ఇక లాస్య తులసిని వెటకారంగా పలుకరిస్తుంది. పుట్టినరోజు వేడుకల్లో జరిగిన దాని గురించి టాపిక్ తీస్తుంది. దాంతో తులసి కూడా తనదైన శైలిలో సమాధానం చెబుతుంది. మీరు నన్ను పుట్టినరోజు వేడుకలకు రాకుండా చేయాలనుకున్నారు కానీ నా కోడలు అంకిత నన్ను రప్పించుకుంది అని అంటుంది.
లాస్యకు గట్టి సమాధానం ఇచ్చిన తులసి..
నువ్వు తీసుకొచ్చిన చీరను కట్టుకోలేదని నేను తెచ్చిన చీరను మార్చేలా చేశారు అని కానీ అది మీ వల్ల కాలేదు అని అంటుంది. అంతేకాకుండా నీకు తినిపించాలనుకున్న కేకు నాకు తినిపించింది అనటంతో లాస్య తిక్క కుదిరినట్లు అవుతుంది. కానీ లాస్య దానికి ఒప్పుకుంటున్నాను అని మరి అంకిత ని ఎందుకు ఇంటికి రావద్దు అన్నావు అని ప్రశ్నిస్తుంది.
దాంతో తులసి జరిగే పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అటువంటి నిర్ణయం తీసుకున్నాను అని.. మీలా కోట్ల ఆస్తులపై ఆశ చూపించటానికి లేని ప్రేమను చూపించను అని అంటుంది. అంతేకాకుండా ఎప్పుడు రెండు వేలు పెట్టి కూడా బట్టలు తెచ్చుకోని మీ శ్రీవారు రెండు లక్షలు పెట్టి ఎలా పుట్టినరోజు చేశాడు అని అంటుంది. కనీసం కన్న కొడుకులకు కూడా కేక్ తీసుకోని రాని ఆయన కోడలి కోసం అన్ని ముందుగానే ఏర్పాటు చేశాడు అని అంటుంది.
ప్రేమ్ కు ధైర్యం ఇచ్చిన శృతి..
అంటే కోట్ల ఆస్తి పై ఆశ తో మీరు ఇలా చేశారు అని అనటంతో.. అవును అని లాస్య ఒప్పుకుంటుంది. ఇక తులసి మాత్రం నా పిల్లలను మరోదారి లా వెళ్లనివ్వకుండా కాపాడుకుంటాను అని గట్టిగా సమాధానం ఇచ్చి అక్కడి నుంచి వెళుతుంది. ప్రేమ్ వేడుకల్లో జరిగిన విషయాలను తలుచుకుంటూ ఉండగా శృతి ధైర్యం ఇస్తుంది.

Intinti Gruhalakshmi June 4 Episode: తులసి పై కేసు పెట్టనున్న నందు..
అభి తన తల్లి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కాని తనను ఏమి ప్రశ్నలు వేస్తుందని భయపడి వెళుతూ ఉండగా తులసి వచ్చి కూర్చోబెట్టి అతడికి అర్థమయ్యేలా మాట్లాడి కొన్ని జాగ్రత్తలు చెబుతోంది. తరువాయి భాగం లో నందు తులసి దగ్గరికి వచ్చి నా పిల్లల్ని నా నుండి దూరం చేస్తావా అని కోపంగా అరుస్తాడు. అంతే కాకుండా ఇలా చేస్తున్నందుకు పోలీస్ స్టేషన్ లో కేసు పెడతాను అనటంతో తులసి కూడా ఏమైనా చేసుకో అని గట్టిగా సవాల్ విసురుతుంది.