Intinti Gruhalakshmi Kasturi: సాధారణంగా ఎంతోమంది వెండితెరపై హీరోయిన్లుగా సందడి చేయాలని భావించి ఇండస్ట్రీ చుట్టూ అవకాశాల కోసం తిరుగుతూ ఉంటారు.ఈ విధంగా ఇండస్ట్రీలో హీరోయిన్ల గా పెద్ద ఎత్తున సందడి చేసిన సెలబ్రిటీలు ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ తిరిగి బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతో మంది సీనియర్ నటీమణులు బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. వెండితెరపై హీరోయిన్ గా నటించడం కోసం హీరోయిన్లు పెద్ద ఎత్తున రెమ్యునరేషన్ తీసుకుంటారు. వీరి రెమ్యూనరేషన్ ఒక్కో సినిమాకు ఇంత పారితోషికం అని ముందుగా అగ్రిమెంట్ చేసుకుంటారు.
ఇకపోతే బుల్లితెర నటీమణుల విషయానికి వస్తే వీరికి ఒక్కరోజు కాల్షీట్స్ కి సంబంధించిన రెమ్యూనరేషన్ ప్రతిరోజు తీసుకుంటారు.ఈ విధంగా బుల్లితెర నటీనటులు ప్రతిరోజు సీరియల్స్ లో సందడి చేస్తూ పెద్ద ఎత్తున పారితోషకం తీసుకుంటున్నారని తెలుస్తోంది. వీరికి రెమ్యూనరేషన్ భారీగా రావడమే కాకుండా విపరీతమైన అభిమానులను కూడా సంపాదించుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ద్వారా సీనియర్ నటి కస్తూరి తులసి పాత్రలో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈమె గతంలో నాగార్జున నటించిన అన్నమయ్య సినిమాలో హీరోయిన్ గా నటించారు.
Intinti Gruhalakshmi Kasturi: సీరియల్ ద్వారా భారీగా సంపాదిస్తున్న కస్తూరి…
ఇలా పలు సినిమాలలో హీరోయిన్ గా మెప్పించిన కస్తూరి ప్రస్తుతం బుల్లితెర సీరియల్ లో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈమె ఒక్కరోజు కాల్షీట్స్ కోసం ఏకంగా 25 వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా అయితే ప్రతి రోజు షూటింగ్ లో పాల్గొంటే నెలకు సుమారు ఏడు లక్షలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి హీరోయిన్ గా వెండితెరపై మెప్పించిన ఈమె బుల్లితెరపై కూడా తన నటనతో అందరిని ఆకట్టుకుంటుంది. ఇలా బుల్లితెర సీరియల్స్ లో నటించడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ పలు అంశాలపై తనదైన శైలిలో తన అభిప్రాయాలను తెలియ చేస్తూ సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు.