Intinti Gruhalakshmi May 10 Episode: ఈరోజు ఎపిసోడ్ లో ప్రేమ్, అభి, దివ్య లు వేదికపై తన తల్లి గురించి చెబుతూ ఎమోషనల్ అవ్వగా వెంటనే తులసి వారి గురించి చెబుతూ పిల్లల బాధ్యత గురించి వివరిస్తుంది. మొత్తానికి తన అద్భుతమైన స్పీచ్ తో అక్కడున్న వారిని ఫిదా చేస్తుంది. అందరూ తులసి మాటలకు గట్టిగా క్లాప్స్ కూడా కొడతారు.
ఆ తర్వాత యాంకర్ అందరిని తమ తమ స్థానాల్లో కూర్చోమని చెబుతుంది. ఇక తులసి ప్రవళికను వెతుకుతూ ఉంటుంది. ఈ విషయం ప్రవళిక కు చెప్పాలి అని పొంగిపోతూ ఉంటుంది. కానీ ప్రవళిక కనిపించకపోయేసరికి దిగులు చెందుతుంది. ఇక ఆ సమయంలో తులసి గెలిచిందని అనౌన్స్మెంట్ రావడంతో అందరూ సంతోషంగా పొంగిపోతారు.
వేడుకలో తులసి కి అవమానం..
కానీ ఇంతలోనే ఓ ముగ్గురు మహిళలు కొడుకులని ఇంట్లో నుంచి బయటికి పంపించినామె బెస్ట్ మదర్ ఎలా అవుతుంది. కనీసం కొడుకులతో మాట్లాడని ఆమెకు ఎలా అవార్డు ఇస్తారు అని సూటిపోటి మాటలతో అంటుంటారు. ఇదంతా లాస్య పెట్టిన చిచ్చు అని అర్థమవుతుంది. ఇక అందరూ తులసిని గట్టిగా నిలదీస్తూ ఉండగా అప్పుడే లక్కీ తనకు కడుపు నొప్పి అని వాష్ రూమ్ కి తీసుకెళ్ళమని లాస్యతో అంటాడు.
లక్కీ విషయంలో కుమిలిపోయిన తులసి..
లక్కీ పడుతున్న బాధని తులసి చూసి కుమిలిపోతుంది. అందరూ తులసిని సమాధానం చెప్పాలి అని అనటంతో వెంటనే తులసి లక్కి ని తీసుకొని వాష్ రూమ్ కి తీసుకొని వెళుతుంది. ఇక దానిని ఆసరాగా తీసుకొని తులసిని మరికొన్ని మాటలు అంటుంటారు. దాంతో అనసూయ దంపతులు, దివ్య ఆ మాటలను తట్టుకోకుండా అందరికీ తులసి గురించి చెబుతుంటారు.
లాస్యకు గట్టి సమాధానం ఇచ్చిన తులసి..
ఇక తులసి కోసం అందరూ ఎదురు చూడగా లక్కీని తీసుకొచ్చిన తులసి.. పిల్లల్ని పట్టించుకోని తల్లికి అవార్డ్ ఎందుకు అంటూ లాస్యకు తనదైన స్టైల్లో ఎదురుదెబ్బ ఇస్తుంది. దాంతో అక్కడున్న వారంతా అది వాస్తవం అనుకుంటారు. ఇక లాస్య అవమానంగా కోపంతో రగిలిపోతూ కనిపిస్తుంది. ఆ తర్వాత తులసికి ఈ అవార్డు అంకితమని జడ్జిలు అంటారు.

Intinti Gruhalakshmi May 10 Episode: నందుకు అవమానం..
ఇక ఈ అవార్డును జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందుతుంది అని అనడంతో అప్పుడే ప్రవళిక జిల్లా కలెక్టర్ గా ఎంట్రీ ఇస్తుంది. అది చూసిన తులసి, కుటుంబ సభ్యులు అందరూ షాక్ అవుతారు. ఇక తులసి దగ్గరకు వచ్చిన ప్రవళిక తనను వేదికపైకి తీసుకెళ్తుంది. తరువాయి భాగంలో తులసిని ఓ ఆఫీస్ మేనేజర్ నందగోపాల్ భార్య అంటే అప్పుడే జాబ్ ఇచ్చేవాడిని కదా అనటంతో.. ఆ హోదా తో కాకుండా మరే హోదాతో ఇచ్చిన కూడా సంతోషంగా తీసుకుంటాను అని నందు ముందు అనటంతో నందు అవమానంగా ఫీల్ అవుతాడు.