Intinti Gruhalakshmi May 12 Episode: ఈ రోజు ఎపిసోడ్ లో తులసి ఉదయాన్నే హడావిడిగా అన్ని రెడీ చేస్తుంది. ఇక ఇంట్లోకి వెళ్లి తన ఫ్రెండ్ ప్రవళిక కొనిచ్చిన డ్రెస్ ను వేసుకుంటుంది. మరోవైపు పరంధామయ్య, అనసూయ మధ్య సరదాగా ఓ సన్నివేశం జరుగుతుంది. అప్పుడే అక్కడకు తులసి ఆ గెటప్ లో రావడాన్ని చూసి అనసూయ కాసేపు సీరియస్ లుక్ తో కాస్త సీన్ క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత బాగున్నావు తులసి అంటూ కాంప్లిమెంట్ ఇస్తుంది.
కోడలితో ఫోటోలు దిగిన అనసూయ..
ఇక దివ్య కూడా చూసి కాంప్లిమెంట్ ఇస్తుంది. నాతో కాలేజ్ కి వచ్చావు అంటే మన ఇద్దరినీ చూసి అక్క చెల్లెలు అనుకుంటారని అంటుంది. అనసూయ తన కోడలితో ఫోటో దిగాలని ముచ్చట పడటంతో దివ్య తెగ ఫోటోలు దింపుతుంది. అప్పుడే ప్రవళిక ఫోన్ చేయగా చెకప్ కి వెళ్తున్నావా అని కూడా వస్తానని అంటుంది. తులసి మాత్రం తాను ఇంటర్వ్యూ కి ఆ తర్వాత చెక్ అప్ కి వెళ్తాను అంటుంది. అడ్రస్ పంపమని నేను కూడా వస్తాను అని ప్రవళిక అంటుంది.
దానికి తులసి సరే అంటుంది. అనసూయ వాళ్లు గుడికి వెళ్తామని ఇకనైనా కష్టాల నుంచి బయట పడేయమని దేవుడిని వేడుకుంటాము అని అనడంతో తులసి సంతోషంగా ఫీల్ అవుతూ కనిపిస్తుంది. ఇక దివ్య నేను కూడా వస్తాను దారి లో దింపమని తన తల్లితో అంటుంది. ఇక ఇద్దరు కలిసి వెళ్లగా అనసూయ దంపతులు సంతోషంగా ఫీల్ అవుతారు. మరో వైపు నందు డిజైనింగ్ సంబంధించిన కంపెనీకి వెళ్లగా అక్కడ ఉన్న మేనేజర్ తన ఫ్రెండ్ కావటంతో ఆయనతో కాసేపు మాట్లాడుతాడు.
నందు కి మంచి ఆఫర్ ఇచ్చిన తన ఫ్రెండ్..
ఇక నందు ఫ్రెండ్.. నందుతో మాట్లాడుతూ.. గతంలో నీకు మంచి అవకాశం ఇచ్చాను అని కానీ నువ్వు వదులుకున్నావు అనటంతో నందు కాస్త బాధపడినట్లు కనిపిస్తాడు. ఇక అతను నందుకు తన ఆఫీస్ లోనే మంచి ఆఫర్ ఇస్తాడు. అప్పుడే తులసి అదే ఆఫీస్ కు ఇంటర్వ్యూ కోసం వస్తుంది. తులసి ఇంటర్వ్యూ కోసం వెళ్ళేసరికి అక్కడ నందు ఉంటాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతారు. ఆ తర్వాత ఆ మేనేజర్ తులసిని ఆ ఉద్యోగానికి యాక్సెప్ట్ చెయ్యడు.
అంతలోనే నందుకు షాక్..
దాంతో తులసీ తన బాధలు చెప్పుకొని తన జీవితం గురించి మొత్తం వివరిస్తుంది. కానీ అతడు జాబ్ కి ఒప్పుకోకపోవడంతో ఆ తర్వాత నందు నిజం చెబుతాడు. మళ్లీ తులసి ని పిలిపించి జాబ్ ఇస్తాను అని.. నందు భార్య అని తెలిస్తే ముందే ఇచ్చేవాడిని అని అనడంతో వెంటనే తులసి నందుని ఉద్దేశించి ఓ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత నందుని ఆ మేనేజర్ తిట్టి.. ఇచ్చిన అవకాశాన్ని రద్దు చేస్తాడు.

Intinti Gruhalakshmi May 12 Episode: గాలిలో ఎగురుతున్న తులసి..
నందు తులసి దగ్గరికి వెళ్లి ఓ రేంజ్ లో ఫైర్ అవుతుంటాడు. తరువాయి భాగంలో తులసి ప్రవళికను కలుస్తుంది. పైన ఎగురుతున్న పక్షిని చూసి తను కూడా అలా కావాలి అని అనుకుంటుంది. దాంతో ప్రవళిక తన కారులో తులసి ని ఎక్కించుకొని గాలిలో ఎగిరేలా చేయిస్తుంది.