Intinti Gruhalakshmi May 13 Episode: ఈరోజు ఎపిసోడ్ లో తులసి నందు వాళ్ల ఫ్రెండ్ ఆఫీస్ కు వెళ్ళగా అక్కడ నందువల్ల తన ఉద్యోగాన్ని వదులుకొని వెనుకకు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో నందు తులసి దగ్గరకు వచ్చి.. నువ్వు ఎలాగో నష్ట పోయావు.. బాగుపడే ఉద్దేశం లేనేలేదు. నీకు జాబు ఇవ్వాలని నేను అనుకుంటే.. నువ్వు నా జాబ్ ఊడగొట్టావు అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ ఉంటాడు. తులసి కూడా ఏమాత్రం తగ్గకుండా నా విషయంలో జోక్యం చేసుకోవద్దు అని వార్నింగ్ ఇస్తుంది.
తులసి కోరికను తీర్చిన ప్రవళిక..
తులసి కోసం కంపెనీ బయట ప్రవళిక ఎదురుచూస్తూ ఉంటుంది. ఆఫీస్ లో జరిగిన విషయాన్ని తలుచుకుంటుంది. ప్రవళిక అంతలో తన దగ్గర ఉన్న చాక్లెట్ ఇవ్వటంతో తులసి వెటకారం గా మాట్లాడుతుంది. కానీ ప్రవళిక మాత్రం తులసి జీవితం గురించి గొప్పగా చెబుతుంది. తులసి జీవితం గురించి మాట్లాడుతూ ఉండగా.. పైన ఎగురుతున్న పక్షులను చూసి తనకు కూడా దేవుడు అలాంటి అవకాశం ఇస్తే బాగుండు అని అంటుంది. దాంతో ప్రవళిక తులసి కోరికను కారు ఓపెన్ టాప్ ద్వారా తీరుస్తుంది. దాంతో తులసి ఎంతో సంతోషపడుతుంది.
సీన్ కట్ చేస్తే..
శృతి ఇంట్లో వంట చేస్తూ ఉండగా ప్రేమ్ ను లేపడానికి మీద నీళ్లు పోస్తుంది. కానీ ప్రేమ్ అక్కడ లేకపోయేసరికి ఎక్కడికి వెళ్ళాడో అని పిలుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రేమ్ ఎంట్రీ ఇవ్వగా ప్రేమ్ రూపురేకలు మొత్తం మారుతాయి. పైగా ప్రేమ్ మాట్లాడే తీరు, ఉండే విధానం కూడా బాగా చిల్ గా కనిపిస్తున్నట్లు గా ఉంటుంది. ఇక తులసితో తాను ఇవ్వాళా జాబ్ కి వెళ్ళను అని ఈ రోజు నేనే వంట చేస్తాను అని అంటాడు.
నందు పై విరుచుకుపడ్డ లాస్య..
మరోవైపు నందు తులసి మాట్లాడిన మాటలు తలుచుకొని కోపంతో రగిలిపోతాడు. అప్పుడే లాస్య రావటంతో జరిగిన విషయం మొత్తం చెబుతాడు. దాంతో లాస్య తులసితో బాగా ఎదురుదెబ్బ తగిలింది అన్నట్టుగా నందు పై విరుచుకు పడుతూ ఉంటుంది. తను నిన్ను దూరం పెట్టిన ఎందుకు అలా తనపై బాధ్యతలు చూపిస్తున్నావు అని మండిపడుతుంది.

Intinti Gruhalakshmi May 13 Episode: తన సత్తా ఏంటో చూపించిన తులసి..
ఇక ఇంట్లో ప్రేమ్ పాటలు పాడుకుంటూ వంట చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇంటి ఓనర్ అక్కడికి వచ్చి ఎలాగైనా అక్కడ ఆరగించాలి అని అనుకుంటాడు. అప్పుడే ఆ ఓనర్ వాళ్ళ భార్య రావటంతో కాసేపు అక్కడ సీన్ బాగా కామెడీగా ఉంటుంది. తరువాయి భాగంలో తులసి బియ్యం బస్తా మోయక పోవటంతో లాస్య, నందు వచ్చి వెటకారం చేస్తారు. దాంతో తులసి దివ్య తో కలిసి బియ్యం బస్తా మోసి తన సత్తా ఏంటో చూపిస్తుంది.