Intinti Gruhalakshmi May 14 Episode: ఒంటరిగా మిగిలిన తులసి.. ఇక ప్రవళిక పాత్ర ముగిసేనా!

Akashavani

Intinti Gruhalakshmi May 14 Episode: ఈరోజు ఎపిసోడ్ లో ప్రవళిక తులసిని ఒక చోటకు తీసుకు వెళుతుంది. అక్కడ జానకి అనే ఒక వయసు మీదపడిన ఆవిడ దగ్గరకు వెళ్లి ఆమె పడిన కష్టాలను వాటిని ఎలా ధైర్యంగా ఎదుర్కొందో అనే విషయాలను తులసికి వివరిస్తుంది. దాంతో తులసి ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇక ఆ జానకి అనే ఆవిడ తన గురించి గొప్పగా చెబుతున్నావు అంటూ ప్రవళిక ను అనడంతో.. మీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడు తులసికి అవసరం కాబట్టి అని అంటుంది.

ఇకపై ఒంటరిగా సవాల్ చేయనున్న తులసి..

ఇక తులసి, ప్రవళిక కాసేపు జీవితం గురించి మళ్లీ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోనే ప్రవళిక తనకు ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయింది అని ఇదే నిన్ను కలవడం చివరి సారి ఏమో అని అంటుంది. దీన్ని బట్టి చూస్తే తులసికి జీవితం పట్ల ఒక పాఠం నేర్పించి.. ఇక తన పాత్రకు పూర్తి గా చెక్ పెట్టినట్లు అర్థమవుతుంది. దాంతో తులసి బాధపడుతూ నాకు జీవితంలో చాలా నేర్పావు అని వివరిస్తుంది. ఇక దీనిని బట్టి చూస్తే తులసి ఒంటరిగానే అన్నీ ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తుంది.

మరో వైపు శృతి తన ఓనర్ తో షాప్ కు వస్తుంది. అక్కడ కూడా ఓనర్ శృతి పై విరుచుకుపడుతూ ఉంటుంది. అదే సమయంలో అక్కడి నుంచి ప్రేమ్ ఓనర్ ఇంటి అద్దె అడిగిన విషయాన్ని తలుచుకుంటూ వస్తాడు. ఎలా చేయాలి అని ఆలోచనలో పడతాడు. అప్పుడే శృతి ప్రేమ్ ను చూసి కనబడకుండా దాచుకుంటుంది. ఇక ప్రేమ్ కాస్త దూరం వెళ్లి తిరిగి మళ్లీ షాప్ లోకి వస్తాడు. ఆ సమయంలో ప్రేమ్ తనని ఎక్కడో చూస్తాడు అని భయ పడుతూ ఉంటుంది.

అభి పై అరిచిన అంకిత..

కానీ ప్రేమ్ మళ్లీ ఆ షాప్ లో ఏమీ తీసుకోకుండా వెనక్కి వెళ్ళి పోతాడు. ఓవైపు అంకిత తన బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. అప్పుడే అభి చీర పట్టుకొని తన దగ్గరికి వస్తాడు. కానీ అంకిత మాత్రం అభిను అవాయిడ్ చేస్తూ ఉంటుంది. దాంతో అభి చాలా బాధపడుతూ కనిపిస్తాడు. ఇక తన కోసం చీర తీసుకు వచ్చాను అని అనడంతో మళ్ళీ తన మాటలతో అభి పై విరుచుకు పడుతుంది. అమ్మ గారి ఇంట్లో ఉన్నా కూడా ఆ వస్తువులను తాకడం లేదు అని అంటుంది.

Intinti Gruhalakshmi May 14 Episode: ఒంటరిగా మిగిలిన తులసి.. ఇక ప్రవళిక పాత్ర ముగిసేనా!
Intinti Gruhalakshmi May 14 Episode: ఒంటరిగా మిగిలిన తులసి.. ఇక ప్రవళిక పాత్ర ముగిసేనా!

Intinti Gruhalakshmi May 14 Episode: నందు పై అరిచిన తల్లిదండ్రులు..

ఇక తులసి తన బండిమీద బియ్యం బస్తా మోసుకొని వస్తుంది. అది తీయడం తనకు కష్టంగా ఉండటంతో వెంటనే పరంధామయ్య చూసి దివ్యను సహాయం పట్టమంటాడు. ఇక అప్పుడే అక్కడికి నందు, లాస్యలు వస్తారు. లాస్య తులసిపై వెటకారం గా మాట్లాడుతూ ఉంటుంది. దాంతో అనసూయ కాసేపు నందు పై విరుచుకు పడుతుంది. పరంధామయ్య కూడా నందు పై అరుస్తాడు.

- Advertisement -