Intinti Gruhalakshmi May 2 Episode: పిట్టగోడపై కూర్చున్న తులసి.. అబ్బో.. అబ్బాయిలతో డాన్స్ లు.. మాములుగా లేదుగా!

Akashavani

Intinti Gruhalakshmi May 2 Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఓ చోట తులసి, ప్రవళిక కూర్చొని ఉంటారు. ఆ సమయంలో తులసి ముఖం బాగా వెలిగిపోతుంది. ఈ రోజు చాలా అద్భుతంగా గడిచింది అని ప్రవళిక తో అంటుంది. ఇక ప్రవళిక కూడా తులసికి కొన్ని విలువైన మాటలు చెప్పి మరింత సంతోష పెడుతుంది. కొన్ని జీవిత పాఠాలు కూడా నేర్పిస్తుంది ప్రవళిక. అంతేకాకుండా కొన్ని గడపాల్సిన విషయాల గురించి కూడా వివరిస్తుంది.

పందెంలో గెలిచిన తులసి..

ఇక అక్కడ నుంచి బయలుదేరుతూ ఉండగా ప్రవళిక అక్కడున్న పానీపూరిని చూసి తిందాం అని అనడంతో తులసి ఇబ్బంది పడుతుంది. మొత్తానికి ప్రవళిక అక్కడికి తీసుకెళ్లి చిన్నప్పుడు పందెం గురించి గుర్తుకు చేస్తుంది. ఇక ఈ రోజు కూడా పందెం కట్టుకుందామని అంటుంది ప్రవళిక. ఇక దానికి తులసి ఎలాగైనా నువ్వే గెలుస్తావ్ అనటంతో అక్కడ కూడా ప్రవళిక జీవితం గురించి మరో పాఠాన్ని చెబుతుంది. మొత్తానికి పందెంకు ఒప్పుకుంటుంది తులసి. దాంతో తులసి గెలవడంతో తులసి రోడ్డు పై చిందులు వేస్తూ ఉంటుంది.

సీన్ కట్ చేస్తే..

ఆరోగ్యం బాలేక పడుకున్న శృతికి ఫోన్ వస్తుంది. దానికి ఎందుకు రాలేదు అని ఒక ఆవిడ ఫోన్ చేసి శ్రుతిని తన మాటలతో బాధ పెడుతుంది. అప్పుడే ప్రేమ్ డాక్టర్ ను తీసుకొని వస్తాడు. శృతి మాత్రం ఫోన్ లో ఆవిడను బ్రతిమాలుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న ప్రేమ్ శృతిని ఎందుకు నిల్చున్నావు అని కాస్త సీన్ క్రియేట్ చేస్తాడు. ఇక డాక్టర్ తనకు మెడిసిన్స్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళి పోతాడు. ప్రేమ్ శృతిని జాగ్రత్తగా చూసుకుంటాడు.

Intinti Gruhalakshmi May 2 Episode: పిట్టగోడపై కూర్చున్న తులసి.. అబ్బో.. అబ్బాయిలతో డాన్స్ లు.. మాములుగా లేదుగా!
Intinti Gruhalakshmi May 2 Episode: పిట్టగోడపై కూర్చున్న తులసి.. అబ్బో.. అబ్బాయిలతో డాన్స్ లు.. మాములుగా లేదుగా!

Intinti Gruhalakshmi May 2 Episode: పిట్ట గోడ పై కూర్చున్న తులసి..

ఓవైపు ప్రవళిక, తులసి పిట్ట గోడ పై కూర్చొని పాప్ కాన్ తింటూ బాగా చిల్ అవుతూ కనిపిస్తారు. అంతేకాకుండా చదువుకునే రోజుల్లో తాము గడిపిన క్షణాలను తలచుకొని తెగ నవ్వుతూ ఉంటారు. ఆ సమయంలో అక్కడికి ఇద్దరు కుర్రాళ్ళు వీరిద్దరినీ తమ మాటలతో వెటకారం చేస్తూ ఒక పాట కూడా పాడతారు. దాంతో ప్రవళిక ఆ కుర్రాళ్ళ ఇద్దరినీ పిలిచి వారి తో ఒక ఆట ఆడుకుంటుంది. పైగా వారిని పాట పాడించి డాన్స్ చేయిస్తుంది.

కుర్రాళ్ల డాన్స్ కు సందడి చేస్తున్న తులసి..

ఇక ప్రవళిక, తులసి కుర్రాళ్ళ డాన్స్ కు చప్పట్లు కొడుతూ బాగా సందడి చేస్తుంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన నందు తులసిని చూసి కోపంతో రగిలిపోతాడు. వెంటనే తులసి నందుని చూసి అక్కడి నుంచి ప్రవళిక ను తీసుకొని వెళుతుంది. తరువాయి భాగంలో తులసి వాకింగ్ షూట్ వేసుకొని వాకింగ్ చేస్తుండగా నందు, లాస్య చూసి షాక్ అవుతారు. అంతేకాకుండా నందును ఎవరు నువ్వు అంటూ షాక్ ఇస్తుంది తులసి.

- Advertisement -