Intinti Gruhalakshmi May 20 Episode: ఈరోజు ఎపిసోడ్ లో.. తులసి ఒక షాప్ కి వెళ్లగా అక్కడ డబ్బులు సరిపోక పోవటంతో ఆ షాపు ఓనర్ తో మాటలు పడుతుంది. అక్కడి నుంచి వెళ్తున్న ప్రేమ్ ఆ మాటలు విని వెళ్లి ఆ షాపు ఓనర్ తో గొడవకు దిగుతాడు. తులసి ఎంత ఆపే ప్రయత్నం చేసినా కూడా ఆపకుండా అలాగే గొడవ పడుతూ ఉంటాడు. దాంతో తులసి తన మాటలతో ప్రేమ్ ను అవమాన పరచి తిట్టి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
సీన్ కట్ చేస్తే..
ప్రేమ్ ఇంటి ఓనర్ ప్రేమ్ ఇంటి బయట ఎదురుచూస్తూ ఉంటుంది. అప్పుడే ప్రేమ్ రావడంతో తన మాటలతో ప్రేమ్ ను గోరంగా అవమానిస్తుంది. ఇక ప్రేమ్ తనను బ్రతిమాలుతూ ఉంటాడు. అప్పుడే శృతి వచ్చి ఇంటి అద్దె ఇవ్వటంతో మళ్లీ రెండు మాటలు అనేసి అక్కడి నుంచి వెళ్లి పోతుంది ఓనర్. ఇక ప్రేమ్ భార్యతో ఇంటి అద్దె కట్టించుకోవాల్సి పరిస్థితి వచ్చింది అని బాధ పడతాడు. మరోవైపు తులసి జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ ఉంటుంది.
పొరపాటు చేసిన తులసి..
అదే సమయంలో వంట చేస్తూ ఉండగా.. ఆ గొడవ గురించి ఆలోచిస్తూ అందులో పొరపాటులో ఉప్పు, కారం ఎక్కువగా వేస్తుంది. అదే సమయంలో దివ్య తమకు ఆకలి వేస్తుంది అనటంతో.. పరంధామయ్య దంపతులకు, దివ్య కు అన్నం వడ్డిస్తుంది. ఇంట్లో సామాన్లు లేకపోవటంతో వంట ఆలస్యం అయ్యిందని చెబుతుంది. ఇక పరంధామయ్య దంపతులు, దివ్య ఒక ముద్ద పెట్టుకోగానే బాధపడతారు. ఇక పరంధామయ్య తినలేక చేతులు కడుక్కొని వెళ్ళిపోతాడు.
ఉద్యోగం చేస్తానంటున్న పరంధామయ్య..
అనసూయ కూడా తినలేక పోతుంది. దివ్య కూడా ఇబ్బంది పడటం తో తులసి వెంటనే రుచి చూసి బాధపడుతుంది. ఇక వెంటనే తులసి తన అత్తమామలు దగ్గరికి వెళుతుంది. వాళ్ళు వంట గురించి టాపిక్ తీస్తే తులసి బాధపడుతుంది అనుకొని మాట మారుస్తూ ఉంటారు. వెంటనే తులసి వారిని కనిపెట్టి క్షమాపణలు తెలుపుకుంటుంది. ఇక మాటల్లో పరంధామయ్య తను వాచ్మెన్ ఉద్యోగం చేస్తాను అనటంతో అనసూయ సరదాగా కామెడీ చేస్తుంది.

Intinti Gruhalakshmi May 20 Episode: నందు ను కడిగిపారేసిన లక్కీ..
ఇక అనసూయ తాను వంటలు చేసి వీడియోలు పెట్టి బాగా సంపాదిస్తాను అని అనడంతో పరంధామయ్య కూడా కామెడీ చేసాడు. ఓ వైపు నందు లక్కీ కోసం వీడియో గేమ్ తీసుకొని రావటంతో లక్కీ ఆయన ఇచ్చినవి తీసుకోను అని.. ఆయన నా డాడీ కాదు అంటూ.. దివ్య అక్క వాళ్ళ డాడీ అంటూ తన మాటలతో ఓ రేంజ్ లో నందుని కడిగి పారేస్తాడు. దాంతో నందు బాధ పడుతూ ఉంటాడు. తరువాయి భాగంలో లాస్య తులసి పై ఓ రేంజ్ లో ఫైర్ అవుతుంది.