Intinti Gruhalakshmi May 21 Episode: ఈరోజు ఎపిసోడ్ లో తులసి ఇంటికి ఇద్దరు పిల్లలు సంగీతం నేర్చుకోవడానికి వచ్చి తులసి మేడం కావాలి అనటం తో వెంటనే అనసూయ ఇంట్లో బాగా హడావుడి చేస్తుంది. తులసిని మేడం అనటంతో తెగ సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది. దాంతో పరంధామయ్య అనసూయకు మతిపోయింది అని సరదాగా కామెంట్ చేస్తూ ఉంటాడు.
డబ్బు కోసం దివ్య చేసిన ప్లాన్..
ఇక తులసి ఆ పిల్లల దగ్గరికి వెళ్లి సంగీతం నేర్పిస్తాను అని మీకు ఎవరు చెప్పారని ప్రశ్నించడంతో సోషల్ మీడియా లో చూశాము అంటారు. దీంతో ఇదంతా దివ్య చేసిన పని కావడంతో వెంటనే తులసి దివ్య పై సరదాగా కోపాన్ని చూపిస్తుంది. దాంతో దివ్య ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని ఇలా చేశాను అనడంతో తులసి సంతోషపడుతుంది.
శృతిపై అరిచిన ప్రేమ్..
మరోవైపు ప్రేమ్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక శృతి ఆఫీసుకు వెళ్తున్నాను అని చెప్పి ప్రేమ్ కు భోజనం చేయమని చెబుతుంది. ఆ మాటకు ప్రేమ్ శృతి పై కాసేపు అరుస్తాడు. మళ్లీ శృతి మాటలను అర్థం చేసుకొని సారీ చెబుతాడు. ఇక నేను కూడా నీతో పాటు మీ ఆఫీస్ దగ్గరికి వస్తాను ఉండటంతో తన బండారం బయట పడుతుంది అని శృతి భయపడుతూ ఉంటుంది.
మొత్తానికి ఇద్దరూ కలిసి రోడ్డుపై వెళుతూ ఉంటారు. శృతి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎలాగైనా ప్రేమ్ ను పంపించే ప్రయత్నం చేయాలి అనుకొని.. పొయ్యి మీద పాలు పెట్టాను అని చెప్పి ప్రేమ్ ను అక్కడినుంచి పంపిస్తుంది. మరోవైపు లాస్య, నందు ఒక ఆఫీస్ కు వెళ్తారు. ఇక అక్కడున్న మేనేజర్ లాస్య కు ఫ్రెండ్ కావటంతో తన ద్వారా నందు కి జాబ్ ఇప్పించే ప్రయత్నం చేస్తుంది.
మేనేజర్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయినా నందు..
ఇక ఆ మేనేజర్ నందుని అవమానపరిచిన వెటకారంగా మాట్లాడుతాడు. దాంతో నందు కోపం గా రియాక్ట్ అవుతాడు. అంతేకాకుండా నీకు ప్రోగ్రామర్ గా జాబ్ ఇస్తాను అనటంతో ఆ చిన్న పోస్ట్ తాను చేయడానికి అవమానంగా ఫీల్ అయ్యి ఆ మేనేజర్ ను తిట్టి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. దాంతో లాస్య కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ప్రేమ్ ఇంటికి వెళ్లి చూడటంతో అక్కడ పొయ్యి మీద పాలు లేక పోయేసరికి శృతి తన విషయంలో ఆలోచనలో పడి మర్చిపోతుంది అని బాధపడుతుంది. ఇక ప్రేమ్ తన మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్లి మళ్లీ జాబ్ గురించి అడుగుతాను అని తన ఇంటికి బయలు దేరుతాడు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఇంట్లోనే శృతి పనిచేస్తుంది.

Intinti Gruhalakshmi May 21 Episode: షాక్ లో శృతి..
అక్కడ శృతిని వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. మరోవైపు లాస్య నందు పై ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ ఉంటుంది. నందు కూడా గట్టిగానే సమాధానం ఇస్తుంటాడు. ఇక ప్రేమ్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ కి ఇంటికి వెళ్లగానే అక్కడ శృతి ప్రేమ్ ను షాక్ అవుతుంది. ఇక ప్రేమ్ ను ఆ డైరెక్టర్ మళ్లీ తన మాటలతో ఇబ్బంది పెడతాడు. దాంతో శృతి ఆ డైరెక్టర్ పని చేయాలని టీ కప్పు కింద పడేస్తుంది. మరోవైపు తులసి ఇంట్లో మ్యూజిక్ నేర్చుకోవటానికి బాగా హడావిడిగా పని చేసుకుంటుంది.