Intinti Gruhalakshmi May 25 Episode: ఈరోజు ఎపిసోడ్ లో పరంధామయ్య దగ్గరికి అనసూయ వచ్చి తాను చేసిన వంటకం గురించి రుచి చూడమని అంటుంది. దాంతో పరంధామయ్య కాసేపు వెటకారంతో కామెడీ చేస్తూ ఉంటాడు. అప్పుడే దివ్య తన ఫీజు విషయంలో ఇంట్లోకి చిరాకుగా వస్తుంది. పరంధామయ్య దంపతులు దివ్య దగ్గరికి వెళ్లి సరదాగా ఆటపట్టిస్తూ ఉండగా.. దివ్య చిరాకు పడుతూ ఉంటుంది.
ఒక దగ్గర వెళ్లి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తులసి రావటంతో పరంధామయ్య దంపతులు దివ్య చిరాకుగా ఉందని అంటారు. దివ్య తులసితో ఫీజు కట్ట లేదన్న బాధ తో మాట్లాడుతూ ఉంటే ఫీజు కట్టాను అని తులసి చెప్పటంతో దివ్య మనసు కుదుటపడింది తనకోసం తన తల్లి ఫీజు కట్టడానికి ఎంత బాధపడిందో అని తన తల్లికి తన చదువు భారం కావద్దు అని మానేస్తాను అంటుంది.
దాంతో తులసి బాధపడుతూ అలా అనకు అమ్మ అని..
నీ చదువు కోసం నేను ఏమైనా చేస్తాను అని.. నాలాంటి పరిస్థితి నీకు రావద్దు అని జీవితంలో ఎదుర్కొనే కష్టాలు గురించి వివరిస్తుంది. అంతేకాకుండా జీవితం గురించి కొన్ని పాఠాలు చెబుతోంది. దివ్య తాను కూడా ఉద్యోగం చేస్తాను అనడంతో మరిన్ని మాటలతో తులసి తనకు ధైర్యం ఇస్తుంది.
సీన్ కట్ చేస్తే..
నందు తను కంపెనీని ప్రారంభించడానికి ఒక వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడున్న లక్కీ ఆడుకుంటూ ఉండగా నందు కోపంతో చిరాకు పడుతూ ఉంటాడు. దాంతో లక్కీ పై గట్టిగా అరుస్తాడు. లక్కీ ఇంట్లోకి భయపడి వెళ్లగా.. వెంటనే లాస్య వచ్చి నందు పై అరుస్తుంది. నందు తన కంపెనీలో పెట్టుబడి గురించి ఆలోచిస్తున్నాను అనటంతో.. అప్పుడే లాస్య కు అంకిత వాళ్ళు గుర్తుకు వస్తారు.
కొడుకును మచ్చిక చేసుకునే ప్లాన్ చేస్తున్న నందు..
నీ కంపెనీకి పెట్టుబడి కావాలి అంటే వెంటనే అభిని మచ్చిక చేసుకో అని చెబుతుంది. ఎందుకు అని నందు అడగటంతో జరిగిన విషయం చెబుతుంది. దాంతో అంకితకు కదా వచ్చింది.. వారిద్దరి మధ్య విభేదాలు ఎలా ఉన్నాయో.. ఎలా అడగాలి అని అనటంతో లాస్య ఏమి కాదులే అని అడగండి అని అంటుంది. దాంతో నందు ఎలాగైనా మచ్చిక చేసుకోవాలి అని అనుకుంటాడు.

Intinti Gruhalakshmi May 25 Episode: తులసిని అవమానపరిచిన గాయత్రి..
మరోవైపు తులసి బండి పంక్షర్ కావడంతో రోడ్డుపై ఉంటుంది. ఇక అప్పుడే ప్రేమ్ వచ్చి తాను బండిని మంచిగా చేయించుకొని వస్తాను అనటంతో తులసి నీకు ఏమి పని లేదా అంటూ ప్రేమ్ పై అరుస్తుంది. ఒక ప్రేమ తనకు నిజంగా నే పని లేదు అంటూ బండి తీసుకొని వెళ్తాడు. ఇక ఆ మాటకు తులసి గుండె తలుక్కుమంటుంది. అప్పుడే అక్కడికి అంకిత రావటంతో అంకిత తులసిని తన ఇంటికి తీసుకొని వెళుతుంది. ఇక అక్కడ తులసిని గాయత్రి తన మాటలతో అందరి ముందు అవమానపరిచేలా మాట్లాడుతుంది.