Intinti Gruhalakshmi May 27 Episode: ఈరోజు ఎపిసోడ్ లో తులసి తన కొడుకుల విషయంలో బాగా ఎమోషనల్ అవుతూ కనిపిస్తుంది. అంతేకాకుండా అభి గురించి అబద్ధాలు చెబుతూ తులసి దొరికిపోతుంది. ఆ సమయంలో అంకిత వచ్చి అసలు నిజం కూడా చెబుతుంది. ఇక అంకిత తులసి ఇంటికి తీసుకెళ్ళి తన తల్లిని నిష్టూరాలు చేసింది అని చెబుతుంది.
అంతేకాకుండా అభి సపోర్ట్ కూడా చేయలేదు అని అనడంతో.. వెంటనే పరంధామయ్య వాడు స్వార్ధపరుడు అని అంటాడు. అయినా కూడా తులసి తన కొడుకుని సమర్థిస్తూ వస్తుంది. దాంతో అంకిత గట్టిగా నిలదీస్తుంది. ఇక తులసి నాకు మంచి అనిపించింది నీకు మంచి అనిపించకపోవచ్చు.. ఎవరి జడ్జ్ చేయకూడదు అని ఉంటుంది.
అంటే మా మమ్మీ మిమ్మల్ని హర్ట్ చేసింది అది కూడా ఒప్పే అంటారా అని గట్టిగా ప్రశ్నిస్తుంది. ఇక తులసి దానికి తగ్గట్టుగా పాజిటివ్ గా సమాధానం చెప్పి సమర్థిస్తుంది. అప్పుడే దివ్య కూడా ఎందుకలా పాజిటివ్ గా ఆలోచిస్తున్నావని ప్రశ్నిస్తుంది. ఇక అంకిత వద్దన్నా కూడా నేనే మిమ్మల్ని బలవంతంగా తీసుకెళ్లి బాధ పెట్టాను అని బాధ పడుతుంది. కాని తులసి నువ్వు రమ్మంటే రాలేదు.. ఇందులో నీ తప్పేమీ లేదు అని అంటుంది.
సీన్ కట్ చేస్తే..
మరోవైపు శృతి తన యజమానికి లంచ్ ఇవ్వడానికి ఆఫీస్ కి వెళ్తుంది. అక్కడ ప్రేమ్ ఉండటంతో ప్రేమ్ కు కనిపించకుండా ఉండాలి అనుకుంటుంది. కానీ అప్పుడే ప్రేమ్ ఎదురవటంతో వెంటనే షాక్ అవుతుంది. ఇక యజమానికి బాక్స్ ఇవ్వకపోతే పనిలోంచి తీసేస్తాడు అని బాధపడుతుంది. వెంటనే ప్రేమ్ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ప్రశ్నించడంతో.. నీ కోసమే అని కవర్ చేస్తుంది.
ఇక నందు అభికి ఫోన్ చేసి ఎమోషనల్గా మాట్లాడుతాడు. దాంతో అభి చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. ఎప్పుడు గుర్తొస్తావ్.. ఫోన్ చేసి మాట్లాడాలి అనిపిస్తుంది కానీ మీ అమ్మ దగ్గర ఉన్నావ్ అని ధైర్యం చేయలేకపోతున్నాను అని నందు అంటాడు. దాంతో మమ్మీ అంటే నాకు ఇష్టం అలా అని మీరు నా శత్రువు కాదు కదా డాడీ అని అంటాడు.
సంతోషంతో పొంగిపోతున్న లాస్య..
ఇక నిన్ను చూడాలని ఉంది.. దగ్గరికి తీసుకోవాలని ఉంది అని అంటాడు నందు. అంతేకాకుండా తులసిని మధ్యలోకి లాగుతూ నెగెటివ్ గా మాట్లాడుతూ ఉంటాడు. వీరిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణను చూసి లాస్య తెగ సంతోషంలో పొంగిపోతుంది. బాగా యాక్టింగ్ చేశారు కదా అని లాస్య అనటంతో.. యాక్టింగ్ కాదు అని.. ఫీల్ తో మాట్లాడాను అని అంటాడు.

Intinti Gruhalakshmi May 27 Episode: కొడుకుల ఫోటోలను చూసి ఎమోషనల్ అవుతున్న తులసి..
ఇక తులసి మాత్రం తన కొడుకుల ఫోటోలను చూసుకుంటూ బాధపడుతుంది. వారి గురించి తలుచుకుంటూ బాధపడుతుండగా దివ్య చూసి మరింత ఎమోషనల్ అవుతుంది. అన్నయ్యల మీద ఇంత ప్రేమ ఉన్నా ఎందుకు దూరంగా ఉండగలుగుతున్నావు అని ప్రశ్నించడంతో వారి కాళ్ళ మీద వారే నిల్చోవాలి అన్నట్లుగా చెబుతుంది. తరువాయి భాగం లో లాస్య తులసి దగ్గరకు వచ్చి తను చేయబోయే కుట్ర గురించి చెబుతుంది.