Intinti Gruhalakshmi May 3 Episode: సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న తులసి ఫోటోలు.. మీ భార్య ఏంటి ఇలా అంటూ నందుకు ఫోన్ లు!

Akashavani

Intinti Gruhalakshmi May 3 Episode: ఈ రోజు ఎపిసోడ్ లో తులసి ఇంటికి వెళ్లి తన ఫ్రెండ్ ప్రవళికతో గడిపిన క్షణాలను తన కుటుంబ సభ్యులతో పంచుకుంటుంది. ఇక ఎదురుగా బట్టలను చూసి దివ్య తన కోసమా అని అడుగుతుంది. కాదు నాకోసం అని.. తనతో చేసిన షాపింగ్ గురించి చెబుతుంది. అంతేకాకుండా తన తో దిగిన ఫోటోలను చూపించటంతో ఇంట్లో వాళ్ళు బాగా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇక ఆ ఫోటోలు దివ్య వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తులసి వద్దన్నా కూడా దివ్య షేర్ చేసేస్తుంది. మా అమ్మ సంతోషాన్ని అందరితో పంచుకోవాలని అంటుంది.

సీన్ కట్ చేస్తే..

లాస్య ఫోన్ చూస్తూ ఉండగా ఆ ఫోటోలను చూసి తెగ మండి పోతుంది. అప్పుడే ఇంటికి చిరాకుగా వచ్చిన నందుకు ఆ ఫోటోలు చూపించి మరింత రెచ్చగొడుతుంది. ఇక మనం కూడా ఎంజాయ్ చేయాలి అని పబ్ కి వెళ్దాం అని అనటంతో నందు చిరాకుగా మాట్లాడుతాడు. తులసి ఎంజాయ్ చేసింది అని మనం ఎంజాయ్ చేస్తామా అని అంటాడు. ఇక తులసి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేయడంతో నందుకు తెగ ఫోన్స్ వస్తుంటాయి.

కోపంతో రగిలిపోతున్న నందు..

మీ భార్య ఏంటి ఇలా మారింది అంటూ కారణం ఏంటి అని అడుగుతూ ఉంటారు. దాంతో నందు మరింత కోపంతో రగిలిపోతాడు. ఇక తులసి ఒంటరిగా నిల్చొని ప్రవళిక తో గడిపిన క్షణాలను తల్చుకుంటూ బాగా మురిసిపోతుంది. అంతేకాకుండా తన ఎదురుగా ఉన్న రోజా మొక్కతో తను గతంలో ఉన్న విషయాలను ఇప్పుడు తను మారిన విషయాన్ని చెప్పుకుంటూ ఇలా ఉండటానికి కారణం తన ఫ్రెండు అని ఆ రోజా పువ్వు తో చెప్పుకుంటుంది.మరోవైపు శృతికి జ్వరం రావటంతో ప్రేమ్ వేడినీళ్లతో కాపురం పెడతాడు.

ఎమోషనల్ గా ఫీల్ అయిన శృతి..

అంతేకాకుండా తనకు దగ్గరుండి అన్ని పనులు చేస్తాడు. ఇక తనను దగ్గరికి తీసుకొని బాగా చూసుకుంటాడు. దాంతో శృతి తనకు ప్రేమగా చూసుకునే భర్త దొరకటంతో చాలా సంతోషంగా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. ఇక ప్రేమ్ తనకు ప్రతి విషయంలో ధైర్యంగా ఉంటాను అన్నట్లుగా మాట్లాడుతాడు. అంతేకాకుండా గతంలో తన తండ్రి తన తల్లికి చేసిన అన్యాయం గురించి చెబుతూ తన తల్లి పడిన బాధలను వివరిస్తాడు.

Intinti Gruhalakshmi May 3 Episode: సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న తులసి ఫోటోలు.. మీ భార్య ఏంటి ఇలా అంటూ నందుకు ఫోన్ లు!
Intinti Gruhalakshmi May 3 Episode: సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న తులసి ఫోటోలు.. మీ భార్య ఏంటి ఇలా అంటూ నందుకు ఫోన్ లు!

Intinti Gruhalakshmi May 3 Episode: నందుకు షాక్ ఇచ్చిన తులసి..

మరోవైపు ఉదయాన్నే వాకింగ్ కోసం ప్రవళిక తులసి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక తరువాయి భాగంలో తులసి వాకింగ్ షూట్ వేసుకొని సరదాగా తన ఫ్రెండ్ తో కలిసి వాకింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే లాస్య, నందు తులసిని చూసి షాక్ అవుతారు. ఇక నందు తులసిపై అరవడంతో.. మీరెవరో తెలుసుకోవచ్చా అని తులసి నందు కు గట్టి షాక్ ఇస్తుంది.

- Advertisement -