Intinti Gruhalakshmi May 31 Episode: ఈరోజు ఎపిసోడ్ లో పరంధామయ్య నిద్రపోకుండా ఒంటరిగా కూర్చుని తులసికి జరిగిన అవమానం గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే తులసి పరంధామయ్యను చూసి ఆలోచనలో ఉన్నాడు అని కాసేపు హిప్నాటిజం చేస్తుంది. ఇక దానికి తగ్గట్టు పరంధామయ్య కూడా నటిస్తూ ఉంటాడు.
అంకిత కు ఫోన్ చేసి విష్ చేసిన తులసి..
ఆ తర్వాత తులసిని చూసి ఎందుకు ఇలా ఉంటున్నావమ్మా అంటూ బాధపడుతుంటాడు. ఇక తులసి అదేం కాదు అని ధైర్యం చెప్పి పడుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. ఇక రాత్రి టైం 12 కావడంతో అంకిత కు ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుంది. అంకిత కూడా తన ఫోన్ కోసం ఎదురు చూస్తున్నానని అంటుంది.
కాసేపు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే దివ్య వచ్చి అంకితకు విష్ చేస్తుంది. అంకితం రేపు అందరూ పార్టీ కి వస్తున్నారు కదా అనటంతో వెంటనే దివ్య మమ్మీ ని పార్టీకి పిలువలేదు అంటూ నిజం చెబుతుంది. దాంతో అంకిత చాలా ఫీల్ అవుతూ బాధపడుతుంది. మీరు రాకపోతే నేను కేక్ కట్ చేయను అని మారం చేయటంతో సరే వస్తాను అని తులసి చెబుతుంది. దాంతో చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది.
కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అభి..
ఉదయాన్నే అభి అంకిత కోసం నెక్లెస్ గిఫ్ట్ గా తీసుకొస్తాడు. ఇక అంకిత నీ సొంత డబ్బుతో తీసుకువస్తేనే ఇవ్వు అనటంతో అభి తన సొంత డబ్బులతోనే తీసుకు వచ్చాను అని నిజం చెబుతాడు. దాంతో అభి తోనే తన మెడలో నెక్లెస్ పెట్టించుకుంటుంది. ఇక ఆంటీ వాళ్ళని పిలిచావా అనటంతో మీ మమ్మీ కోసం పిలువలేదు అని అభి అంటాడు.
దాంతో అంకిత మా మమ్మీ కోసం మీ మమ్మీ ని వదులుకుంటావా అని అనడంతో ఏమనలేక పోతాడు. అంతే కాకుండా ప్రేమ్ వాళ్లను కూడా పిలిచావా లేదా అనడంతో పిలువ లేదు అని అంటాడు. ఆ తర్వాత అంకిత ప్రేమ్ వాళ్లకి ఫోన్ చేసి వారితో ప్రేమగా గొడవ పడుతుంది. వాళ్లను తన బర్త్ డే కి రమ్మని అంటుంది. ఫోన్ కట్ చేశాక ప్రేమ్ అక్కడికి అమ్మ కూడా వస్తది అని నన్ను చూసి మళ్లీ ఇబ్బంది పడుతాది అని అంటాడు.

Intinti Gruhalakshmi May 31 Episode: తులసి గిఫ్టును తీసుకున్న అంకిత..
మరోవైపు తులసి అంకిత కోసం స్వయంగా తన చేతులతో చీర రెడీ చేస్తుంది. పరంధామయ్య, అనసూయ వచ్చిన వారికి కావాల్సినవి ఇవ్వకుండా తన పనిలో లీనమవుతుంది. అంకిత కోసం చీర కుడుతున్నాను అనటంతో పరంధామయ్య దంపతులు ఆశ్చర్యపోతారు. అప్పుడే దివ్య వచ్చి బర్త్డే పార్టీ కి వెళ్తున్నాము అనటంతో తులసి కూడా వెళ్తున్నాము అని వారికి చెబుతుంది. ఇక లాస్య అంకిత కోసం కాస్ట్లీ చీరని పట్టుకుని వస్తుంది. తరువాయి భాగంలో అంకిత లాస్య ఇచ్చిన గిఫ్ట్ ను కాకుండా తులసి తెచ్చిన చీరను కట్టుకుంటాను అని అనడంతో గాయత్రి కోపంగా రియాక్ట్ అవుతుంది.