Intinti Gruhalakshmi May 4 Episode: వీరలెవల్ లో నందుకు క్లాస్ పీకిన తులసి.. గాయనిగా మారనున్న గృహలక్ష్మి!

Akashavani

Intinti Gruhalakshmi May 4 Episode: ఈరోజు ఎపిసోడ్ లో తులసి కోసం ప్రవళిక పార్కులో ఎదురుచూస్తూ ఉంటుంది. తులసి వాకింగ్ కి వస్తుందా లేదా అని ఆలోచనలో పడుతుంది. బహుశా వాకింగ్ డ్రెస్సుతో రావడానికి ఇబ్బంది పడుతుందేమో అని అనుకుంటుంది. కానీ అంతలోనే అక్కడకు తులసి
వాకింగ్ షూట్ డ్రస్ లో శాలువా కప్పుకొని వస్తుంది.

దాంతో ప్రవళిక తులసిని చూసి షాక్ అవుతుంది. పైగా ముసుగు వేషంలో వచ్చిన తులసిని చూసి నవ్వుకుంటుంది. ఇక తులసి కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది. ఇక ప్రవళిక తనకు కాసేపు తన మాటలతో హితబోధన చేస్తుంది. ఎవరైనా నిన్ను విచిత్రంగా చూస్తే రేపటి నుంచి వాకింగ్ కి రావద్దు అని అంటుంది. దాంతో తులసి తను కప్పుకున్న శాలువా తీసి నిల్చుంటుంది.

తులసికి ఎదురుపడ్డ నందు, లాస్య..

ఇక తులసిని ఎవరు పట్టించుకోకపోవడంతో తులసి సంతోషంగా ప్రవళిక తో కలిసి వాకింగ్ చేస్తుంది. అదే సమయంలో అక్కడికి నందు, లాస్య కూడా వాకింగ్ కోసం వస్తారు. ఇక తులసి, ప్రవళికల వాకింగ్ అయిపోవటంతో.. ప్రవళిక తులసికి చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతుంటుంది. అదే సమయంలో నందు, లాస్య తులసిని చూడగా వెంటనే నందు తులసి ని గట్టిగా పిలుస్తాడు

తులసి మాటలకు నందు షాక్..

ఇక ప్రవళిక అక్కడ ఆగి ఏం జరుగుతుందా అన్నట్లు చూస్తూ ఉంటుంది. వెంటనే నందు తులసిపై అరుస్తూ ఉంటాడు. వయసు మీద పడ్డాక కూడా ఇలా ఉండటం ఏంటి అని అంటాడు. దాంతో తులసి మీరు ఎవరో తెలుసుకోవచ్చా అని అనటంతో నందు షాక్ అయినట్లు కనిపిస్తాడు. వెంటనే నందు భారీ భారీ డైలాగులు కొడుతూ తులసిని నానారకాలుగా అంటుంటాడు.

గట్టిగా క్లాస్ పీకిన తులసి..

కానీ తులసి మాత్రం ఏ మాత్రం భయపడకుండా నందు తో గట్టిగా మాట్లాడుతుంది. ఇక నందు మాత్రం తనతో భార్య హక్కు ఉన్నట్లుగా మాట్లాడటంతో వెంటనే తులసి పక్కన ఉన్న నీ భార్యకు చెప్పని అంటుంది. నీ ఇంట్లో నా కుటుంబ సభ్యులు ఉన్నంతవరకు నీదే బాధ్యత అని కాబట్టి గౌరవం గా ఉండాలి అని అనటంతో.. ముందు నీ పక్కన ఉన్న భార్య వేసుకునే డ్రెస్సుల గురించి ప్రశ్నించు అని వీరలెవల్లో గట్టిగా క్లాస్ పీకుతుంది.

మరోవైపు శృతి వంట చేస్తూ ఉండగా ప్రేమ్ రెస్ట్ తీసుకోమని అంటాడు. ఇక శృతి కూడా కాసేపు కొన్ని విలువైన మాటలు చెప్పి ప్రేమ్ ను ఒప్పిస్తుంది. తులసి ఇంటికి రావడంతో దివ్య తన తల్లి గెటప్ చూసి ఫిదా అవుతుంది. ఇక పరంధామయ్య దంపతులు కూడా తులసిని చూసి మురిసిపోతారు.

Intinti Gruhalakshmi May 4 Episode: వీరలెవల్ లో నందుకు క్లాస్ పీకిన తులసి.. గాయనిగా మారనున్న గృహలక్ష్మి!
Intinti Gruhalakshmi May 4 Episode: వీరలెవల్ లో నందుకు క్లాస్ పీకిన తులసి.. గాయనిగా మారనున్న గృహలక్ష్మి!

Intinti Gruhalakshmi May 4 Episode:  సింగర్ గా మారనున్న తులసి..

తరువాయి భాగంలో తులసి దివ్య ఫీజు గురించి ఆలోచించటం తో ప్రవళిక తులసి చిన్ననాటి కళ గురించి గుర్తుకు చేస్తుంది. మళ్లీ గాయనిగా మారు అని అంటుంది. దీనిని బట్టి చూస్తే తులసి కూడా సింగర్ గా మారే అవకాశం ఉందని.. పైగా ఎప్పుడో గాని ప్రేమ్ రాసే పాటను తాను పాడుతుందని అనిపిస్తుంది.

- Advertisement -