Intinti Gruhalakshmi May 5 Episode: తులసిని పట్టించుకుంటానంటున్న నందు.. అత్తకు లొంగిపోతున్న అభి!

Akashavani

Intinti Gruhalakshmi May 5 Episode: ఈరోజు ఎపిసోడ్ లో.. తులసి వాకింగ్ షూట్ ను చూసి ఇంట్లో వాళ్లంతా అలాగే చూస్తూ ఉండిపోతారు. అంతే కాకుండా బాగుంది అని కాంప్లిమెంట్ కూడా ఇస్తారు. ఇదంతా కారణం తన ఫ్రెండ్ ప్రవళిక అని అంటుంది తులసి. అంతేకాకుండా ఇలా సంతోషంగా ఉండటానికి కారణం కూడా తనే అని చెబుతుంది. ఇక దివ్య కాలేజ్ కు వెళ్తూ తనకు ఫీజ్ కట్టమని అంటుంది. ఆ మాటకు తులసి ఎటువంటి సమాధానం చెప్పక ఆలోచనలో పడుతుంది.

సీన్ కట్ చేస్తే..

మరోవైపు నందు తులసీ మాట్లాడిన మాటలను తలుచుకొని కోపంతో రగిలిపోతాడు. మధ్యలో లాస్య తనను వాకింగ్ కు రానంటే బలవంతంగా తీసుకొని వెళ్ళావు అని.. ఇప్పుడు తులసీ తో అవమానం ఎదురయింది అని బాధపడుతూ కోపంతో కనిపిస్తుంది. ఏరోజైనా నా డ్రెస్సుల గురించి కామెంట్ చెయ్యంది నువ్వు.. ఈరోజు తులసి బట్టలపై ఎందుకు కామెంట్ చేసావు అని ఆమె గురించి నీకు ఎందుకు పట్టింపు అని అంటాడు.

నందు పై ఫైర్ అయిన లాస్య..

దాంతో నందు నేను తులసిని పట్టించుకుంటాను అని.. ఎందుకంటే నా తల్లిదండ్రులు అక్కడ ఉన్నారని అంతేకాకుండా దివ్య పెళ్లి అయ్యేవరకు తులసిని పట్టించుకోవడం నా బాధ్యత అని అంటాడు. ఇక ఆ మాటలకు లాస్య కోపం వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక తులసి దివ్య ఫీజు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పరంధామయ్య దంపతులు కూడా అక్కడికి వచ్చి తన బాధను అర్థం చేసుకుంటారు.

ఎలాగైనా దివ్య ఫీజు కడతాను అని వాళ్లకు ధైర్యం చెబుతుంది. ఇక ప్రవళిక ను కలిసి తన బాధలను చెప్పుకుంటుంది. వెంటనే ప్రవళిక మళ్లీ పాటలు పాడటం మొదలు పెట్టమని సలహా ఇస్తుంది. దాంతో తులసి ఆలోచనలో పడుతుంది. ఇక తులసి ఇంటి దగ్గరకు అంకిత వచ్చి బాగా ఎమోషనల్ గా మాట్లాడుతూ కనిపిస్తుంది. అంతేకాకుండా తన బాధలను షేర్ చేసుకుంటోంది.

Intinti Gruhalakshmi May 5 Episode: తులసిని పట్టించుకుంటానంటున్న నందు.. అత్తకు లొంగిపోతున్న అభి!
Intinti Gruhalakshmi May 5 Episode: తులసిని పట్టించుకుంటానంటున్న నందు.. అత్తకు లొంగిపోతున్న అభి!

Intinti Gruhalakshmi May 5 Episode: అత్తకు లొంగిపోయిన అభి..

ఇక అంకిత తులసికి కొన్ని డబ్బులు ఇస్తూ ఉండగా.. వెంటనే తులసి ఆ డబ్బులు తిరిగి తనకు ఇప్పుడు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నావు కాబట్టి అక్కడ పర్మిషన్ అడిగి ఇవ్వు అని అంటుంది. ఓవైపు అభి హాస్పిటల్ కి వెళ్తూ ఉండగా తన దగ్గరకు తన అత్తయ్య గాయత్రి వచ్చి తన ఖర్చులకు డబ్బులు ఇవ్వడంతో అభి ఆనందంగా తీసుకుంటాడు.

అది చూసిన అంకిత తన తల్లి అక్కడి నుంచి వెళ్ళాక వెళ్లి అభిని గట్టిగా మందలిస్తుంది. అంతేకాకుండా తులసి గురించి గొప్పగా చెబుతుంది. తరువాయి భాగంలో తులసి మదర్స్ డే వేడుకలకు వెళ్లగా అక్కడికి లాస్య, నందు కూడా వస్తారు. ఇక అక్కడ లాస్య కొడుకు తులసిని చూసి తన దగ్గరికి వెళ్లి పట్టుకుంటాడు. అది చూసి లాస్య కోపంతో రగిలిపోతుంది.

- Advertisement -