Intinti Gruhalakshmi May 6 Episode: లక్కీ రాకతో ఆనందంలో తులసి.. కోపంతో రగిలిపోతున్న లాస్య!

Akashavani

Intinti Gruhalakshmi May 6 Episode: ఈరోజు ఎపిసోడ్ లో పరంధామయ్య, అనసూయల మధ్య కాసేపు సరదాగా మాటల యుద్ధం జరుగుతోంది. అప్పుడే దివ్య వచ్చి అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని ఈ రోజు మదర్స్ డే కాస్త ఎమోషనల్ గా కనిపిస్తుంది. ఇక తులసి మాత్రం తన తల్లి దగ్గరికి వెళ్లి తల్లికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పి కాసేపు ఎమోషనల్ గా మాట్లాడుతుంది.

సీన్ కట్ చేస్తే..

లక్కీ ఆడుతూ ఉండగా అక్కడకు నందు రావడంతో లక్కీ నందును చూసి భయ పడుతూ ఉంటాడు. అప్పుడే లాస్య వచ్చి డాడీ అని పిలవమనడంతో నందు అలా పిలిపించుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. లక్కీ కూడా గతంలో నందు తో మాట్లాడిన విషయాన్ని గుర్తుకు చేసుకొని ఆయనను అలా పిలవమని చెబితే పిలుస్తాను అని అంటాడు. దాంతో నందు నాకు కొంచెం టైం కావాలి లాస్య అనటంతో లాస్య కోపంతో రగిలిపోతుంది.

ఇక నందు మదర్ థెరిస్సా ఫౌండేషన్ దగ్గర తనకు పని ఉందని అనడంతో లక్కీ నేను కూడా వస్తాను అని మారాం చేస్తాడు. లక్కీ కోసం నేను కూడా వస్తాను అని లాస్య అంటుంది. ఆ తర్వాత తులసి ఇంటికి వెళ్లడంతో దివ్య ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది. తన తల్లి దగ్గరికి వెళ్లాను అనటంతో వెంటనే దివ్య కూడా తులసికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతుంది.

తులసికి మదర్ థెరిస్సా ఫౌండేషన్ లో బెస్ట్ మదర్ అవార్డు అవటంతో ఇంట్లో వాళ్లంతా సంతోషంగా ఫీల్ అవుతారు. తులసి అక్కడికి వెళ్లను అని మారం చేయడంతో అప్పుడే ప్రవళిక ఫోన్ చేసి ఎలాగైనా వెళ్లాలి అని అంటుంది. దీంతో మదర్ థెరీస్సా ఫౌండేషన్ లో మాతృ దినోత్సవ వేడుకల దగ్గరికి తులసి ఒప్పుకుంటుంది. ఇక ఈ వేడుక దగ్గర ప్రవళిక తులసి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.

లక్కీ పై కోపంతో రగిలిపోయిన లాస్య..

ఆ సమయంలో తులసి, అనసూయ దంపతులు వస్తారు. అంతేకాకుండా అక్కడకు లాస్య, నందులతో పాటు లాస్య కొడుకు లక్కీ కూడా వస్తాడు. అప్పుడే లక్కీ అక్కడున్న తులసి దగ్గరికి వెళ్లి ప్రేమగా పలకరిస్తాడు. ఇక తులసి కూడా లక్కీని దగ్గరకు తీసుకొని ప్రేమగా ముద్దాడుతోంది. పక్కనే ఉన్న ప్రవళిక అదంతా గమనిస్తూ ఉంటుంది. లాస్య మాత్రం కోపంతో రగిలి పోతూ ఉంటుంది.

Intinti Gruhalakshmi May 6 Episode: లక్కీ రాకతో ఆనందంలో తులసి.. కోపంతో రగిలిపోతున్న లాస్య!
Intinti Gruhalakshmi May 6 Episode: లక్కీ రాకతో ఆనందంలో తులసి.. కోపంతో రగిలిపోతున్న లాస్య!

Intinti Gruhalakshmi May 6 Episode: ఎమోషనల్ అయినా తులసి పిల్లలు..

నిన్ను హాస్టల్ నుంచి తీసుకు వచ్చింది నాతో ఉండటానికి అనడంతో.. వెంటనే లక్కీ తులసి ఆంటీ అంటే నాకు ఇష్టం అనడంతో మరింత కోపంతో లాస్య రగిలిపోతుంది. వెంటనే ఏంట్రా ఆ పొగరు అని కొట్టడానికి వెళ్తుంది. వెంటనే తులసి లాస్య అంటూ గట్టిగా అరిచి అడ్డు పడుతుంది. ఆ తర్వాత వేదికపై అభి, ప్రేమ్, దివ్య లు బాగా ఎమోషనల్ అవుతూ ఉంటారు.

- Advertisement -