Intinti Gruhalakshmi May 7 Episode: కన్నతల్లి పరువు తీసిన లక్కీ.. బెస్ట్ మదర్ గా గెలిచిన తులసి!

Akashavani

Intinti Gruhalakshmi May 7 Episode: ఈరోజు ఎపిసోడ్ లో.. లక్కీ కారు దిగి వెంటనే పరిగెత్తుకొని వచ్చి తులసిని పలకరిస్తాడు. అక్కడే ఉన్న ప్రవళిక లక్కీ తులసి పై చూపిస్తున్న ప్రేమను చూసి మురిసిపోతుంది. కానీ లాస్య కోపంతో రగిలిపోతుంది. లక్కీ తులసితో అందరు ఎందుకు విడివిడిగా ఉంటున్నారు ఆంటీ అని అడుగుతుంది. మమ్మీ ని అడిగితే మాత్రం కోపం అవుతుందని అంటాడు.

కోపంతో రగిలిపోయిన లాస్య..

వెంటనే లాస్య వచ్చి లక్కీ ను కొట్టబోతుండగా.. తులసి అడ్డుకుంటుంది. లాస్య కు గట్టిగా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక పక్కనే గమనిస్తున్న ప్రవళిక తులసి పై పడుతున్న నిందను సరి చేసే ప్రయత్నం చేస్తుంది. మీ కొడుకు నేరుగా వచ్చి తులసితో మాట్లాడాడు అని న్యాయంగా మాట్లాడుతుంది. ఇక లాస్య వెంటనే అక్కడ కాసేపు అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

తులసి కొడుకులను రప్పించిన ప్రవళిక..

ఇక అనసూయ వాళ్లు ఇంటికి వెళ్ళిపోదాం అని అనటంతో ధైర్యంగా ముందుకు నడవాలి అని ధైర్యం చెబుతుంది తులసి. ఇక లోపలికి వెళ్దాం పదండి అని తులసి అనటంతో.. ప్రవళిక అందరూ వచ్చారా అని అడుగుతుంది. అందరూ వచ్చారు అని తులసి అనటంతో అప్పుడే ప్రేమ్, అభిలు కూడా వస్తారు. ఇక అభి తులసి దగ్గరికి వెళ్లి ఎమోషనల్ అవుతూ హ్యాపీ మదర్స్ డే అని అంటాడు.

ప్రేమ్ ను బాధపెట్టిన తులసి..

దాంతో తులసి సంతోషపడుతుంది. అదే సమయంలో ప్రేమ్ కూడా హ్యాపీ మదర్స్ డే అని చెప్పగా తులసి పట్టించుకోకుండా అభిని తీసుకొని లోపలికి వెళుతుంది. అక్కడున్న వాళ్లంతా ప్రేమ్ ను చూసి బాధ పడతారు. అందరు లోపలికి వెళ్లి కూర్చోగా అక్కడ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రవళిక లోపలికి రాకుండా పక్కనే ఉండి గమనిస్తుంది.

ఇక ఆ వేడుకలో అందరి తల్లులకు కొన్ని గేమ్స్ లాగా పెడతారు. లాస్య తన పేరు రాయించమని నందు పేరు రాయడానికి వెళ్తాడు. ఇక అక్కడ అనసూయ కనిపించటంతో తన తల్లికి హ్యాపీ మదర్స్ డే చెప్పాలి అని వెళ్తాడు. వెంటనే అనసూయ నందు పై కోపంగా మాట్లాడుతుంది. గట్టిగా క్లాస్ పీకుతుంది. దాంతో నందు బాధపడినట్లు కనిపిస్తాడు.

Intinti Gruhalakshmi May 7 Episode: కన్నతల్లి పరువు తీసిన లక్కీ.. బెస్ట్ మదర్ గా గెలిచిన తులసి!
Intinti Gruhalakshmi May 7 Episode: కన్నతల్లి పరువు తీసిన లక్కీ.. బెస్ట్ మదర్ గా గెలిచిన తులసి!

Intinti Gruhalakshmi May 7 Episode: ఒక హోదాతో ఎంట్రీ ఇచ్చిన ప్రవళిక..

అందులో లక్కీకి ఇష్టమైన వంటకం గురించి లాస్య చెప్పకపోగ ఆ తర్వాత తులసీ చెబుతుంది. దాంతో అక్కడ లాస్యపరువు పోయినట్టుగా కనిపిస్తుంది. ఆ తర్వాత ప్రేమ్ కు అమ్మ అంటే ఇష్టమని తులసి చెప్పి గెలుస్తుంది. అలా అక్కడున్న వారందరూ ఈ గేమ్ లో పాల్గొనగా కొందరు గెలుస్తారు. మరికొందరు ఓడిపోతుంటారు. తరువాయి భాగం లో తులసి బెస్ట్ మదర్ గా గెలవడంతో తనను అభినందించడానికి ప్రవళిక ఒక హోదా తో వస్తుంది. మరి ఆ హోదా ఏంటో తరువాయి భాగంలో చూడాలి.

- Advertisement -