Intinti Gruhalakshmi May 9 Episode: ఈరోజు ఎపిసోడ్ లో.. తులసి కుటుంబ సభ్యులంతా మాతృ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక ఆ వేడుకలో తల్లి పిల్లల మధ్య కొన్ని కాంపిటీషన్ లు పెట్టగా అందులో లాస్య తో పాటు తులసి కూడా పాల్గొంటుంది. ఇక తులసి ఆ రౌండ్లలో కూడా గెలుస్తూ ఉంటుంది. లాస్య మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అభి తన తల్లి గురించి గొప్పగా చెబుతూ తన తల్లి తనకు ప్రతి విషయంలో అండగా ఉంది అని అంటూ బాగా ఎమోషనల్ అవుతాడు.
తన తండ్రి మాత్రం తనకు సపోర్ట్ గా లేడు అని అనడంతో నందు కోపంగా రగిలిపోతాడు. దివ్య కూడా గతంలో తను ఎదురుకున్న చేదు అనుభవాన్ని పంచుకుంటూ అప్పుడు తన తల్లి తనకు అండగా ఉంది అని.. ఒక తండ్రి బాధ్యత కూడా తనే మోసింది అని అంటుంది. ఆ మాటకు కూడా నందు అవమానం గా ఎదుర్కొంటాడు. ప్రేమ్ కూడా తన తల్లి తనకు జన్మనివ్వడమే కాకుండా తన తండ్రి లాగా బాధ్యతలు కూడా మోసింది అని అంటాడు. ఇక ఆ మాటలకు నందుకు బాగా మండిపోతుంది.
లక్కీ మాటలకు ఎమోషనల్ అయినా తులసి..
ఆ తర్వాత లక్కీ మాట్లాడుతూ తన తల్లి గురించి ఎంతో గొప్పగా చెబుతాడు. కాని ఇదంతా నిజం కాదని కేవలం కల లో అని అనడంతో లాస్య కోపంతో రగిలిపోతూ అవమానంగా ఫీల్ అవుతుంది. ఇక లక్కీ అంతటితో ఆగకుండా పడుతున్న బాధలను బాగా ఎమోషనల్గా చెబుతాడు. దాంతో ఆ మాటలు విని తులసి చాలా కుమిలిపోతుంది. అక్కడున్న వారంతా కూడా లక్కీ మాటలకు బాధపడుతూ కనిపిస్తారు.
వేదికపై ఎమోషనల్ అయిన ప్రేమ్, దివ్య..
ఆ తర్వాత యాంకర్ అక్కడున్న వారిని మళ్లీ ప్రశ్నలు అడుగుతూ మళ్లీ తులసి, లాస్య దగ్గరికి వస్తుంది. మళ్ళీ వారిని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తోంది. నందు ఇక వెళ్ళిపోదాం అని రిజల్ట్ అర్థమవుతుంది కదా అని అంటాడు. కానీ లాస్య.. తులసి గెలవదని నేనే గెలుస్తాను అని గట్టిగా పంతం వేస్తుంది. మొత్తానికి అలా అన్ని రౌండ్ లు పూర్తి చేసుకోగా చివరి రౌండ్లో తమ తల్లుల గురించి పిల్లలను అడుగుతుంది యాంకర్.

Intinti Gruhalakshmi May 9 Episode: తులసికి అవమానం..
ఇక తులసి వాళ్ళ దగ్గరికి రాగా ప్రేమ్, అభి, దివ్య వేదిక పైకి వెళ్లి తమ తల్లికి తాము ఏమి చేసింది లేదు అంటూ బాగా ఎమోషనల్ అవుతారు. అప్పుడే తులసి వేదికపైకి వచ్చి వాళ్లను ఓదారుస్తూ వాళ్లు తన కోసం చాలా చేశారు అని చెబుతుంది. ఆ మాటలకు లాస్య కోపంతో కుళ్ళు కుంటుంది. తరువాయి భాగం లో తులసి గెలవడంతో అక్కడున్నవారంతా పిల్లలతో కనీసం మాట్లాడటానికి ఇష్టపడని తల్లి ఎలా గెలుస్తుంది అంటూ తులసిను అవమానిస్తారు.