Chinmayi: పెళ్లి తర్వాత స్టార్ హీరోయిన్ నయనతార తీరు వివాదాస్పదం అవుతూ ఉంది. ఆమె తీసుకునే నిర్ణయాలు, సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు కాంట్రవర్సీ అవుతున్నాయి. పెళ్లి తర్వాత భర్త విఘ్నేశ్ శివన్ తో కలిసి నయనతార సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతోంది. రోజూ ఏదోక పోస్టు పెడుతూ ఉంటుంది. అయితే ఆమె పెట్టే పోస్టులపై విమర్శలు వస్తోన్నాయి. నెటిజన్లు ఆమె తీరుపై తీవ్రంగా మండిపడుతున్నాయి.
నయనతార సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, మీడియాలో ఆమె చేసే ప్రకటనలపై ట్రోల్స్ విపరీతంగా వస్తోన్నాయి. సోషల్ మీడియాలో ఆమె పెట్టే ఫొటోలు, వీడియోలపై నెటిజన్లు అసభ్యకర కామెంట్లు చేస్తున్నారు. పెళ్లి అయి పిల్లలు ఉన్నా.. ఇంకా ఈ ఫొటోలు ఏంటి అంటూ ట్రోల్ చేస్తోన్నారు.
తాజాగా కనెక్ట్ అనే సినిమాలో నయనతార నటించింది. ఎక్కువగా సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో నయనతార పాల్గొనదు. కానీ కనెక్ట్ అనే సినిమా ప్రమోషన్స్ లో నయనతార పాల్గొంటుంది. ఈ సందర్భంగా బాడీ షేపింగ్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పురుషులు ఇంట్లో ఉంటే మహిళలు వారి కన్నబిడ్డలకు కూడా చున్నీ వేసే తిప్పాలేమో అని చిన్మయి తెలిపింది.
Chinmayi:
పరుషుడు అతడి ఫీలింగ్స్ ఆపుకోలేడు కదా.. తండ్రైనా, సోదరుడైనా ఇంట్లో ఆడపిల్లను కూడా అలాంటి దుర్భద్దితోనే చూస్తాడేమో అని చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆడపిల్లలను మహిళలందరూ ఇలాంటి పరుషులకు దూరంగా ఉండాలని చిన్మయి సూచించింది.