Pawan Kalyan: టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమంలో నటించింది తక్కువ చిత్రాలలోని అయినప్పటికీ ఎక్కువ క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించినటువంటి నటీనటులలో ముందు వరసలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మొదటగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ తన ప్రతిభను నిరూపించుకొని సొంతంగా పైకి వచ్చాడు. ఈ క్రమంలో అతడు చేసినటువంటి మంచి పనులే ఈ రోజున స్టార్ హోదాని కట్టబెట్టాయి.
అంతేకాకుండా ఇప్పటివరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలలో దాదాపుగా ఎక్కువ శాతం చిత్రాలు డిజాస్టర్లే ఉన్నాయి. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ కి ఫాలోయింగ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలో ఏకంగా ఫాన్స్ కంటే భక్తులు ఎక్కువయ్యారని చెప్పవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ కూడా కేవలం సినిమాల్లో హీరోగా మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎంతోమందికి సహాయం చేస్తూ అండగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్నాడు.
అయితే సినిమాలపరంగా మరియు నటనపరంగా అలాగే రాజకీయాల పరంగా మంచి క్రేజ్ సంపాదించిన పవన్ కళ్యాణ్ కి తన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు మాత్రం చేదు అనుభవాలను మిగిల్చాయి. అయితే 1997వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ నందిని అనే యువతీని పెద్దలు కుదిరిచిన వివాహం చేసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఈ బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. దీంతో 2002వ సంవత్సరంలో నందిని కి విడాకులు ఇచ్చి ఆ తర్వాత మళ్లీ ప్రేమలో పడి మాజీ తెలుగు హీరోయిన్ రేణు దేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
కానీ దురదృష్టవశాత్తు ఈ పెళ్లి కూడా ఎక్కువ రోజులు నిలబడలేదు. అయితే పవన్ కళ్యాణ్ తన మొదటి భార్య అయిన నందిని కి విడాకులు ఇచ్చిన సమయంలో భరణంగా దాదాపుగా ఐదు కోట్ల రూపాయలకు పైగా డబ్బు ఇచ్చినట్లు పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ విషయంపై పవన్ కళ్యాణ్ అభిమానులు స్పందిస్తూ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి మరియు వారి గతం గురించి తవ్వుతూ అనవసరమైన విషయాలను సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.