Priya Prakash Varrier

Priya prakash : ప్రియా ప్రకాష్ గురించి తెలియని వారుండరు. గత మూడేళ్ళ నుంచి తను కన్ను కొట్టిన వీడియోనూ కొన్ని వందల సార్లు రివైండ్ చేసి చూసుకున్న వాళ్ళు కోట్లలో ఉన్నారు. యూత్ నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు ఈ వీడీయోకి ఫ్యాన్స్ అయ్యారు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ని కూడా ప్రియ ప్రకాష్ కన్నుకొట్టి ఫ్లాట్ చేసేసింది. ఒరు ఆదార్ లవ్ సినిమా ప్రమోషన్స్‌కి గెస్ట్‌గా వచ్చిన అల్లు అర్జున్ .. ప్రియా ప్రకాష్‌ని తన మాటలతో మోసేశాడు. అంతగా ఒక చిన్న వీడియో బైట్‌తో ప్రపంచ వ్యాప్తంగా జనాలను తన అభిమానులుగా మార్చుకుంది ప్రియా ప్రకాష్.

is-priya-prakash-varior-trying-like-this

ఇదే అవకాశం అనుకొని డెబ్యూ సినిమా రిలీజ్ కాకుండానే సినిమాలలో అవకాశాలు వస్తే కోట్లలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి దెబ్బైపోయింది. అదే తన కెరీర్‌కి ఒకరకంగా పెద్ద మైనస్ అయింది. డెబ్యూ సినిమా ఒరు అదార్ లవ్ రిలీజ్ కాకుండానే బాలీవుడ్‌లో శ్రీదేవి బంగళా సినిమా చేసేసింది. ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. గ్యారెంటీగా పెద్ద హీరోయిన్ అవుతుందని శ్రీదేవి బంగళా ట్రైలర్ చూసిన వాళ్ళు చెప్పుకున్నారు. అలాంటి ఛాలెంజింగ్ రోల్ చేసిందని ఈ సినిమా ట్రైలర్ ద్వారా అర్థమయింది. అయితే ఈ సినిమాలో అలనాటి అందాల తార శ్రీదేవికి సంబంధించిన విషయాలను శ్రీదేవి బంగళాలో చూపించారని కాంట్రవర్సీ కావడంతో ఏకంగా సినిమా రిలీజ్ కాకుండా నిలిపి వేశారు.

Priya prakash : ప్రియా ప్రకాష్ ప్రయోగాలను ఎందుకు ట్రై చేస్తుందో..!

ఇక డెబ్యూ సినిమా రిలీజయ్యాక చూస్తే అసలు ప్రియా ప్రకాష్‌ది చెప్పుకునే క్యారెక్టర్ కాదన్న కామెంట్స్ వినిపించాయి. దాంతో తన ఆశలన్ని తారుమారయ్యాయి. ఇలాంటి సమయంలో నితిన్ నటించిన చెక్ సినిమాలో అవకాశం వచ్చింది. కానీ ఈ సినిమా రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిందే. అయినా అదృష్టం బావుండి కుర్ర హీరో తేజ సజ్జాతో ఇష్క్ సినిమా చేసింది. అయితే ఈ సినిమా థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. దాంతో ఇంత చిన్న ఏజ్‌లో లవ్ స్టోరీస్ చేయకుండా థ్రిల్లర్ సినిమాలంటు ప్రయోగాలను ఎందుకు ట్రై చేస్తుందో అని కామెంట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా అయినా ఈ యంగ్ బ్యూటీకి లైఫ్ ఇస్తుందా.. లేక సర్దేసుకోమంటుందా చూడాలి. కాగా ఇష్క్ సినిమా ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 18, 2021 at 4:55 ఉద.