NTR : టైటిల్ చూడగానే మీకు ముందుగా…. ఏంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి చెల్లెలు ఉందా..? ఒకవేళ ఉన్నా కూడా ఆమె రియాల్టీ గేమ్ షోలో ఎందుకు కంటెస్టెంట్ గా పాల్గొంటుంది అనే డౌట్ రావచ్చు. అక్కడికే వస్తున్నా… ఎన్టీఆర్ చెల్లెలు అంటే సొంత చెల్లెలు కాదు. ఆ మధ్య ప్రముఖ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన రాఖీ చిత్రంలో హీరో చెల్లెలు పాత్రలో నటించిన ప్రముఖ యాంకర్ మంజూష. అయితే యాంకర్ మంజూష కి రాఖీ చిత్రంలో నటించిన తర్వాత మంచి గుర్తింపు వచ్చింది.
అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో కూడా సినిమా ఆఫర్లు బాగానే వరించాయి. కానీ మంజూషా నటించిన పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఈ అమ్మడికి నటిగా గుర్తింపు లభించలేదు. దీంతో సినిమా ఇండస్ట్రీలో తన ఫ్యూచర్ ని దృష్టిలో ఉంచుకొని మంజూరు యాంకరింగ్ రంగంలో కెరీర్ ని మొదలు పెట్టింది. అయితే నటి మంజూష నటనా రంగంలో పెద్దగా నిలదొక్కుకోలేకపోయినప్పటికీ యాంకరింగ్ లో మాత్రం బాగానే నిలదొక్కుకుంది.
దీంతో ప్రస్తుతం పలురకాల షోలు, ఈవెంట్లు అలాగే ఇంటర్వ్యూలు అంటూ బాగానే సంపాదిస్తోంది. అయితే తాజాగా యాంకర్ మంజూష గురించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే యాంకర్ మంజూష తెలుగులో బాగా పాపులర్ అయిన ప్రముఖ రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్ 6వ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం వచ్చిందని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ అమ్మడికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉండటంతో బిగ్ బాస్ షో నిర్వాహకులు కంటెస్టెంట్ గా పాల్గొని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. కానీ ఇప్పటివరకు యాంకర్ మంజూష మాత్రం తనకు బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఆఫర్ వచ్చినట్లు వినిపిస్తున్న వార్తల పై మాత్రం స్పందించలేదు. దీంతో యాంకర్ మంజూష కి బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆఫర్ వచ్చిందనే వినిపిస్తున్న వార్తల్లో నిజమెంతో ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ విషయం ఇలా ఉండగా యాంకర్ మంజూష ఈ మధ్యకాలంలో సినిమా ఆఫర్ల కోసం బాగానే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు పలు రకాల ఫోటో షూట్లు కూడా పాల్గొంటూ తన అందాల ఆరబోతతో కుర్రకారును మతి పోగొడుతోంది. అంతేకాకుండా ఈ ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ రోజురోజుకీ ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ పెంచుకుంటోంది.