Sai Pallavi: ఇండస్ట్రీలో నేచురల్ బ్యూటీగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సాయి పల్లవి ఒకరు. ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె అనంతరం సినిమాలలో నటిస్తే పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇలా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకొని ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సాయి పల్లవి గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సాధారణంగా చాలామంది హీరోయిన్స్ తమ అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం పెద్ద ఎత్తున సర్జరీలు చేయించుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సాయి పల్లవి కూడా తన ప్రశాంతత కోసం తన సుఖం కోసం ఒక సర్జరీకి సిద్ధమయ్యారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలా సాయి పల్లవి కూడా సర్జరీ చేయించుకోబోతుంది అనే వార్త తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారా అసలు ఈమె ఎందుకు సర్జరీ చేయించుకుంటుంది ఏంటి అనే విషయానికి వస్తే…
కాలికి సర్జరీ చేయించుకొనున్నారా…
సాయి పల్లవి ఎంతో అద్భుతంగా డాన్స్ చేస్తారు అనే విషయం మనకు తెలిసిందే. అయితే ఒకానొక సమయంలో డాన్స్ చేసేటప్పుడు ఈమె కాళ్లు కాస్త బెనికిందట అప్పటినుంచి తీవ్రమైనటువంటి కాలినొప్పి సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ నొప్పి మరి కాస్త ఎక్కువ కావడంతో ఈమె తప్పని సరి పరిస్థితులలో ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందటానికి సర్జరీ చేయించుకోబోతున్నారని తెలుస్తుంది. ఈ నొప్పి కారణంగా సాయిపల్లవి కనీసం నడవడానికి అలాగే డాన్స్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారట. దీంతో సర్జరీ చేయించుకోవడానికి సిద్ధమైనారని తెలుస్తోంది .ఇక ప్రస్తుతం ఈమె కెరియర్ విషయానికి వస్తే చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య నటించబోతున్న సినిమాలో హీరోయిన్ గా నటించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు.