Praveen -Faima: ప్రస్తుత కాలంలో ప్రేమించుకోవడం బ్రేకప్ చెప్పుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంది. చాలా మంది ప్రేమించుకున్నటువంటి వారు కాస్త క్రేజ్ పేరు ప్రఖ్యాతలు రాగానే బ్రేకప్ చెప్పుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు బుల్లితెర సెలబ్రిటీలలో అధికంగా ఉన్నాయని చెప్పాలి. ఇలా బుల్లితెర సెలబ్రిటీగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో జబర్దస్త్ ప్రవీణ్ పైమా జంట కూడా ఒకటి. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాం అంటూ ప్రకటించారు.
ఇక వీరిద్దరి పెళ్లికూడా కన్ఫామ్ అయ్యిందని రేపు శుభవార్త కూడా చెబుతారు అనుకుంటున్న సమయంలోనే ప్రవీణ్ షాకింగ్ న్యూస్ వెల్లడించారు. తన జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి తనతో పాటు ఫైమా వుంది. మేమిద్దరం మంచి స్నేహితులు మా ఇద్దరి మధ్య స్నేహమే మొదలైందని తెలిపారు. అయితే ఈ జర్నీలో నేను తన ప్రేమలో పడ్డాను అదే విషయం ఫైమాకు చెప్పడంతో తను నో చెప్పింది. నేను తనని ప్రేమిస్తున్నాననే విషయం చెప్పాను. నన్ను ప్రేమించడం ప్రేమించకపోవడం పూర్తిగా తన నిర్ణయమేనని ఈయన తెలియజేశారు. ఫైమా నన్ను ప్రేమించడం లేదని నేను తనకు దూరం కాను మా ఇద్దరి మధ్య అలాగే స్నేహబంధం కొనసాగుతుందని ప్రవీణ్ తెలిపారు.
బిగ్ బాస్ షో కారణమా
ఇలా పెళ్లి చేసుకోవాల్సిన వీరిద్దరూ చివరికి బ్రేకప్ చెప్పుకున్నారనే విషయం తెలియడంతో చాలామంది వ్యవహార శైలి పై కామెంట్ చేస్తున్నారు. ఒకప్పుడు తనకు ఏ విధమైనటువంటి క్రేజ్ లేని సమయంలో ప్రవీణ్ ను ప్రేమిస్తున్నానని ఆయనతో చట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఇప్పుడు ఈమెకు కాస్త క్రేజ్ రావడంతో ప్రవీణ్ ని దూరం పెట్టింది అంటు కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే ప్రవీణ్ ను దూరం పెట్టడానికి బిగ్ బాస్ షోనే కారణమని ఈ షో ద్వారా ఈమెకు కాస్త క్రేజ్ రావడంతో ప్రవీణ్ పట్ల చిన్న చూపు చూస్తూ ఆయనని తిరస్కరించింది అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. కానీ ప్రవీణ్ మాత్రం బిగ్ బాస్ కారణంగా తనలో ఎలాంటి మార్పులు రాలేదని తాను పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లి ఇప్పుడిప్పుడే బయటపడుతుంది అంటూ చెప్పుకోచ్చారు. ఏది ఏమైనా బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి వచ్చిన తర్వాత ఫైమా ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది అన్నది వాస్తవం.