Star Couples: సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు ఎంత తొందరగా అయితే ప్రేమలో పడతారో అంతే తొందరగా వారి ప్రేమ బంధం నుంచి బయట పడుతూ ఉంటారు. ఇలా ఎంతోమంది ప్రేమించుకుని బ్రేకప్ చెప్పుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇక చాలామంది పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టిన తర్వాత కూడా విడాకులు తీసుకున్నటువంటి వారు కూడా ఇండస్ట్రీలో ఉన్నారని చెప్పాలి అయితే తాజాగా మరో స్టార్ కపుల్స్ కూడా విడాకులు తీసుకోబోతున్నారంటూ విడాకుల గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అభిషేక్ ఐశ్వర్య దంపతుల విడాకుల వార్తలు తరచు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి అయితే గతంలో ఈ వార్తలను అభిషేక్ పూర్తిగా ఖండించారు కానీ తాజాగా మరోసారి వీరి విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..ఇలా వీరి విడాకుల గురించి సందేహాలు రాకపోవడానికి కారణం లేదు. అభిషేక్ ఐశ్వర్య 50 వ పుట్టినరోజు సందర్భంగా తన పుట్టినరోజు వేడుకలలో పాల్గొనలేదు. తాజాగా మనీష్ మల్హోత్రా ఇచ్చిన పార్టీకి కూడా అభిషేక్ దూరంగా ఉన్నారు.
ఇద్దరు విడిపోయారా…
ఇలా ఈ మధ్యకాలంలో ఐశ్వర్య ఒంటరిగా కనిపించడంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా వీరికి సంబంధించి మరొక వార్త సంచలనంగా మారింది. ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుని అప్పుడే ఆరు నెలలు అయిందని అయితే ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించకుండా రహస్యంగా ఉంచారంటూ కూడా మరొక వార్త చక్కర్లు కొడుతుంది. ఇలా విరి విడాకులు వార్తలు వైరల్ కావడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు. ఎంతో అన్యాయంగా ఉన్నటువంటి ఈ జంట ఇలా విడాకులు తీసుకోవడం ఏంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఐశ్వర్య అభిషేక్ విడాకుల గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.