Niharika: నిహారిక కొణదేల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు మెగా బ్రదర్ నాగబాబు వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ఈమె కెరియర్ మొదట్లో యాంకర్ గా పనిచేశారు. అనంతరం హీరోయిన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె పెద్దగా ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోవడంతో పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. అయితే నిహారిక పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కువ కాలం పాటు తన వైవాహిక జీవితంలో కొనసాగలేకపోయింది దీంతో ఈమె తన భర్తకు విడాకులు ఇచ్చి తిరిగి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
ఈ క్రమంలోనే నిహారిక ప్రస్తుతం పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్ హౌస్ స్థాపించి పలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నారు అయితే తాజాగా ఓ సినిమాని కూడా ఈమె తన నిర్మాణ సంస్థలో ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులను త్వరలోనే జరుపుకోబోతుంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఈ పూజా కార్యక్రమాలలో భాగంగా నిహారిక వీపు మీద ఉన్నటువంటి టాటూ బయటపడటంతో ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈమె వేయించుకున్న టాటూ ఏంటి? దీని అర్థం ఏంటి అనే విషయాల గురించి ఓ వార్త వైరల్ అవుతుంది.
స్వేచ్ఛ జీవిగా…
నిహారిక టాటూ కనక చూస్తే ఎగురుతున్న పక్షిల అనిపిస్తుంది. అయితే ఈమె ఈ టాటూ విడాకులు తీసుకున్న తర్వాత వేయించుకున్నారని తన మాజీ భర్తను ఉద్దేశించే ఈ టాటూ వేయించుకున్నారని తెలుస్తోంది. చిన్నప్పటి నుంచి తన ఇంట్లో ఎంతో స్వేచ్ఛగా బ్రతికినటువంటి నిహారిక పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లిన తర్వాత అక్కడ పంజరంలో బంధించిన చిలకలాగా మారిపోయారు. తనకు ఏమాత్రం స్వేచ్చలేదు అలాగే తన ఇష్టాలకు కూడా అడ్డు చెప్పడంతో ఈమె ఎంతో ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. అయితే తన భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఈమెకంటూ స్వేచ్ఛ దొరికింది అని తెలుపుతూ ఈ టాటూ వేయించుకున్నారని ఇది తన మాజీ భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్య ఉద్దేశించి వేయించుకున్నారు అంటూ ఈ వార్త వైరల్ అవుతుంది.