Jabardast Comedians: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విశ్వక్ సేన్ టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి లు సోషల్ మీడియాలో నానుతూనే ఉన్నారు. వీళ్లిద్దరి మధ్య జరిగిన క్లాష్ లో బయటపడ్డ బూతులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ట్రోల్స్ రూపంలో కూడా దేవి నాగవల్లి ఇన్ స్టాగ్రామ్ లో తను అన్న మాటలు నెట్టింట్లో హడావిడిగా మారాయి.
అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్ లో భాగంగా.. హీరో విశ్వక్సేన్ చేసిన ఫ్రాంక్ వీడియోలు భారీ ఎత్తున రచ్చ క్రియేట్ చేశాయి. టీవీ9 యాంకర్ దేవి విశ్వక్ సేన్ ల మధ్య పెద్ద ఎత్తున మాటలు ఘర్షణ జరిగింది. విశ్వక్ సేన్ మాటలకూ అసహనం వ్యక్తం చేసిన దేవి నాగవల్లి విశ్వక్ సేన్ ను గెట్ అవుట్ అని మొహం మీద చెప్పేస్తుంది.
ఇక విశ్వక్ f***అంటూ దేవి నాగవల్లి పై విరుచుకు పడ్డాడు. ఈ విధంగా వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం ట్రోల్స్ రూపంలో బయట పడుతున్నాయి. చివరికి ఎక్స్ ట్రా జబర్దస్త్ లో కూడా దేవి నాగవల్లి ని విశ్వక్ సేన్ ను వాడేసారు. పొట్టి నరేష్ పంచులు ఒక రేంజ్ లో పండిపోయాయి. కెవ్వుకార్తీక్ తో కలిసి చేసిన స్కిట్ లో కార్తీక్ ని ఒక రేంజ్ లో ఆడుకున్నాడు నరేష్. నరేష్ గెటవుట్ అంటూ యాంకర్ నాగవల్లి ను ఇమిటేట్ చేశాడు.

Jabardast Comedians: అనిల్ రావిపూడి పెద్దగా నవ్వుకుంటూ ఈ విధంగా సైగ చేస్తాడు!
ఇక కెవ్వుకార్తీక్ కూడా ఏమాత్రం తగ్గకుండా అచ్చం విశ్వక్ సేన్ మాదిరిగా వాట్ ది f***అనబోతాడు. నువ్వు ఈ స్కిట్ నుంచి గెట్ అవుట్ అంటూ అచ్చం దేవి నాగవల్లి లానె ఇమిటేట్ చేస్తాడు. ఇక ఈ వీరిద్దరి మధ్య సంభాషణ మొత్తం డైరెక్టర్ అనిల్ రావిపూడి చూస్తూ ఒక రేంజ్ లో చిల్ అవుతూ ఉంటాడు. ఇక పెద్దగా నవ్వుకుంటూ ఇది అదే అన్నట్టుగా సైగ చేస్తాడు.