Jabardast Ritu: తెలుగు సినీ ప్రపంచానికి యాక్టర్ రోజా గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించి తెలుగు ఇండస్ట్రీలో నటిగా చెరగని ముద్ర వేసుకుంది. ఇక తన చక్కటి అందం తో ఎంతోమంది అభిమానులను తన సొంతం చేసుకుంది. ఇక మొన్నటివరకు రోజా బుల్లి తెర జబర్దస్త్ లో హడావిడి చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఇక రోజా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మినిస్టర్ బాధ్యతలు చేపట్టి పూర్తిగా జబర్దస్త్ షో కి బ్రేక్ ఇచ్చింది. ఈ విషయాన్ని బుల్లితెర ప్రేక్షకులు, జబర్దస్త్ యాక్టర్స్ ఎవరు మొన్నటివరకు యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఇక జబర్దస్త్ షో ప్రస్తుతం బాగానే ఊపందుకుంటుంది అని చెప్పవచ్చు. కొన్ని లవ్ ట్రాక్ ల వల్ల ఇంకా ఆ షో ప్రేక్షకులను మెప్పించగలుగుతుంది.
ఇక జబర్దస్త్ షోలో సుధీర్, రష్మి ల లవ్ ట్రాక్ తరువాత ఈ మధ్య అజర్ రీతూ, చౌదరి ల ట్రాక్ బాగానే హడావిడి చేస్తోంది. వీరిద్దరూ పలు వేరే షో లలో కూడా అదే ట్రాక్ మెయింటైన్ చేస్తున్నారు. మొత్తానికి వీరిద్దరి కాంబో మరో లెవెల్ అనిపించుకుంటున్నారు. అజర్, రీతూ చౌదరి ల మధ్య కామెడీ టైమింగ్ లు బాగా పండి పోతున్నాయి. ఇక వీరిద్దరి చేసే స్కిట్ లు కూడా అదే వేలో ఉంటాయి.
ఇక తాజాగా అజర్ రీతూ కి తన టీం లో టీ లు అందించే అమ్మాయిగా క్యారెక్టర్ ఇచ్చాడు. గతంలో లవర్ గా.. భార్యగా మంచి పాత్రలు ఇచ్చిన అజర్ ఇప్పుడు రీతూ కి ప్రొడక్షన్ టీ లు ఇచ్చే అమ్మాయిగా మార్చడంతో రోజాకు సందేహం కలిగింది. దాంతో అసలు విషయం ఏమిటో తెలుసుకుందామని ప్రయత్నం చేసింది.

Jabardast Ritu: రోజా షాక్ అవ్వడానికి కారణం ఇదే!
ఇక రోజా ఒకసారి టీ.. మరొకసారి తుడవడం అంటే నీకు కోపం అనిపించట్లేదా? అని అడిగింది. దానికి రీతూ మాట్లాడుతూ అజర్ నాకు నచ్చని అబ్బాయి.. కానీ అజర్ నాకు ఆ రెండు నెలల్లో ఇచ్చిన సప్పోర్ట్ వల్లే మళ్లీ ఇకడ నేను నవ్వుతూ ఉన్నాను. అని అజర్ ను రీతూ గట్టిగా హాగ్ చేసుకుంది. దీంతో రోజా ఒక్క సరిగా షాక్ అయ్యింది.