Jabardast Vinod : బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ద్వారా ఇప్పటికే చాలా మంది కమెడియన్లు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. జబర్దస్త్ నుంచి కొంత మంది ఇప్పటికే సినిమాల్లోకి వెళ్లి సెటిల్ అయితే ఇంకొంత మంది మాత్రం వేరే ఛానల్స్ కు వెళ్లి అక్కడ ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నారు. అయితే ఎవరు ఎక్కడికి వెళ్లినా కూడా వారిని ఇప్పటికీ అందరూ జబర్దస్త్ కమెడియన్స్ గానే పిలుస్తూ ఉంటారు. అలాంటి వారిలో వినోదిని కూడా ఒకరు. వినోదినిగా పిలువబడే వినోద్ కూడా జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీని పొందారు.
కడప ప్రాంతానికి చెందిన వినోద్ సినిమాల్లో నటించాలనే అవకాశాల కోసం హైదరాబాద్ చేరగా ఆ సమయంలో జబర్దస్త్ టీమ్ లో చేరారు. లేడీ గెటప్ ఆర్టిస్ట్ గా ఆయన చేసిన స్కిట్ అందరికీ బాగా నచ్చేసింది. ఆ టైంలో చమ్మక్ చంద్ర వినోదినికి తన స్కిట్లలో చేసే అవకాశం కల్పించాడు. అయితే కొన్ని రోజులుగా ఆయన జబర్దస్త్ కు దూరంగా ఉంటున్నారు.
తాజాగా వినోద్ ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు తెలియజేశాడు. ఆ ఇంటర్వ్యూలో వినోద్ పూర్తిగా బక్క చిక్కి పోయి కనిపించడంతో అందరూ వినోద్ కు ఏమైందంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వినోద్ తన గురించి, తన పరిస్థితి గురించి చెబుతూ కంటతడి పెట్టుకున్నాడు. తను ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్లుగా తెలిపాడు. ఆ ఇన్ఫెక్షన్ రావడం వల్లే తాను పూర్తిగా బక్కచిక్కిపోయానని, దానివల్ల హెయిర్ లాస్ కూడా వచ్చిందని వినోద్ తెలిపాడు.
Jabardast Vinod :
ఇప్పుడు తన పరిస్థితి పర్వాలేదని, తన కుటుంబం, భార్య తనకు అండగా నిలిచారని తెలిపాడు. హైదరాబాదులో ఎలా అయినా ఇల్లు కొనుక్కోవాలనుకున్నానని, అందులో భాగంగా 13 లక్షలు నష్టపోయానని తెలిపారు. అప్పట్లో లంగ్స్ పాడయిపోయి ఉంటే జడ్జిలుగా ఉన్న రోజా, నాగబాబులు తనకు ఎంతో సాయం చేశారని తెలిపారు. మళ్లీ తిరిగి షోలలో కనిపిస్తానని వినోద్ ధీమా వ్యక్తం చేశారు.