Jabardast: గత 9 సంవత్సరాల నుంచి బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్య క్రమం ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీలో గొప్ప స్థాయిలో ఉన్నారు.ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అవ్వడమే కాకుండా ప్రస్తుతం వీళ్లు వెండితెరపై కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈ విధంగా ఈ కార్యక్రమం మొదట్లో కొన్ని విమర్శలు ఎదుర్కొన్న ప్రస్తుతం ఈ కార్యక్రమానికి విపరీతమైన అభిమానులు ఉన్నారని చెప్పాలి. ఇలా తొమ్మిది సంవత్సరాల నుంచి అద్భుతమైన రేటింగ్స్ సొంతం చేసుకుంటూ నెంబర్ వన్ కామెడీ షో గా ఉన్నటువంటి జబర్దస్త్ కార్యక్రమంలో ఇకపై కామెడీ ఉండదని తెలుస్తోంది.
ఈ కార్యక్రమానికి మూలస్తంభంగా ఉన్నటువంటి న్యాయనిర్ణేతలు రోజా నాగబాబు ఇద్దరు కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అదిరే అభి చమ్మక్ చంద్ర వంటి కమెడియన్స్ కూడా వెళ్ళిపోయారు.వీళ్ళు వెళ్లి పోయినప్పటికీ హైపర్ ఆది సుడిగాలి సుదీర్ వంటివారు ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకు వచ్చారు. ప్రస్తుతం హైపర్ ఆది సుడిగాలి సుధీర్ గెటప్ శీను కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి కల తప్పిపోయిందని ఇదివరకు లాగా ఈ కార్యక్రమానికి ఆదరణ ఉండదని చెప్పవచ్చు.

Jabardast: ఒంటరి వాడు అయ్యాను….
తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో భాగంగా కమెడియన్స్ రాకేష్, కార్తీక్ టీమ్ మెంబెర్స్ కలిసి సుడిగాలి సుదీర్ టీమ్ ఫ్రెండ్షిప్ గురించి స్కిట్ చేశారు. ఇకపోతే ఈ స్కిట్ చూస్తున్నంత సేపు జడ్జీ స్థానంలో ఉన్నటువంటి ఇంద్రజ, యాంకర్ రష్మీ, ఆటో రాంప్రసాద్ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆటో రాంప్రసాద్ మాట్లాడుతూ తనని గెటప్ శీను సుడిగాలి సుదీర్ ఇద్దరు వదిలేయడంతో ఒంటరివాడు అయ్యానని, తను ఎవరితో స్కిట్ చేయాలంటూ ఎమోషనల్ అయ్యారు.వారు లేకపోతే ఇకపై జబర్దస్త్ లో కామెడీ కూడా ఉండదంటూ ఆటో రాంప్రసాద్ తెలిపారు.ఇక రామ్ ప్రసాద్ ఎమోషనల్ కాగా ఇంద్రజ తనని ఓదారుస్తూ మీ టీమ్ కి దిష్టి తగిలింది అంటూ ఆటో రాంప్రసాద్ ను ఓదార్చే ఇచ్చే ప్రయత్నం చేశారు.