Jabardasth Avinash: ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందారు. అలా గుర్తింపు పొందిన ఎంతోమంది సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకొని వెండితెర మీద కూడా సందడి చేస్తున్నారు. జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన కమెడియన్లలో ముక్కు అవినాష్ కూడా ఒకరు. జబర్దస్త్ స్టేజ్ మీద తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్వించి కమెడియన్ గా అవినాష్ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. జబర్దస్త్ ద్వారా వచ్చిన గుర్తింపుతో బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో పాల్గొనే అవకాశం దక్కించుకొని అక్కడ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
బిగ్ బాస్ తర్వాత జబర్దస్త్ లో పాల్గొనే అవకాశం లేకపోవడంతో మాటీవీలో ప్రసారమవుతున్న టీవీ షో లలో పాల్గొంటూ అవినాష్ సందడి చేస్తున్నాడు. ఇలా కమెడియన్ గా మంచి గుర్తింపు పొందిన అవినాష్ అనూజ అనే యువతని వివాహం చేసుకొని సంతోషంగా జీవిస్తున్నాడు. వీరి వివాహం జరిగి ఇప్పటికీ ఒకటిన్నర సంవత్సరం గడిచింది. అవినాష్ భార్య అనూజ కూడా బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోలలో అప్పుడప్పుడు తన భర్తతో కలిసి పాల్గొంటూ సందడి చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
Jabardasth Avinash: ఇద్దరం ముగ్గురు కాబోతున్నాం…
ఇదిలా ఉండగా తాజాగా తన అభిమానులకు అవినాష్ ఒక శుభవార్త తెలియజేశాడు. అనూజతో తన వివాహం జరిగిన ఒకటిన్నర ఏడాదికి తాను తండ్రి కాబోతున్నట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో అవినాష్ మాట్లాడుతూ” పెళ్లైన ఏడాదిన్నరకే మేం తల్లిదండ్రులు కాబోతున్నాం.. మూడు నెలల వరకు డాక్టర్ ఎవరికీ చెప్పొదని అన్నారు.. ప్రస్తుతం తనకు నాలుగో నెల.. అందుకే ఈ సంతోషకరమైన వార్త బయటకు చెబుతున్నాం.. నాలుగో నెలలో మా బేబీ హర్ట్ బీట్ విన్నాము.ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం.. మా పేరెంట్స్, తన పేరెంట్స్ ఎంతో హ్యాపీగా ఉన్నారు” అంటూ అవినాష్ శుభవార్త తెలియజేశాడు. దీంతో అవినాష్ – అనూజ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.