Jabardasth Komaram: తెలుగు బుల్లితెర జబర్దస్త్ షో ఏ స్థాయిలో పాపులర్ అయిందో.. అదే స్థాయిలో చాలా మందికి అన్నం పెట్టింది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ జబర్దస్త్ ద్వారానే చాలా మంది కమెడియన్లు బాగుపడ్డారు. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో కూడా జబర్దస్త్ కమెడియన్ లు అడుగు పెట్టారు. అలా బుల్లి తెరపై మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ లలో కొమరం కూడా ఒకరు.
తన డిఫరెంట్ మాటలు కట్టు బొట్టుతో.. ఎంతో మంది ప్రేక్షకులను కట్టి పడేశాడు. ఇక అదే క్రమంలో తన కష్టాన్ని కూడా ధారపోశాడు అని చెప్పవచ్చు. ఇక అతడు ఎంతలా కష్టపడ్డాడో.. తన భార్య కూడా అదే విధంగా సపోర్ట్ చేసిందని తెలిపాడు. యాంకర్ సుమ క్యాష్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న కొమరం తన భార్య రజిత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశాడు. అతను ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి కారణం అతని భార్య అని తెలియజేశాడు.

Jabardasth Komaram: కొమరం భార్య ఐదు సంవత్సరాలపాటు రాత్రింబవళ్ళు కస్టపడి ఇలా చేసిందట!
తన జీవితంలో రజిత లేకపోతే.. ఏమై పోయే వాడినేమో అంటూ కంట కన్నీరు పెట్టాడు. మూడేళ్లు ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు చెయ్యి.. నా గురించి పిల్లల గురించి మర్చిపో నువ్వు సక్సెస్ కాకపోతే తిరిగి వచ్చాయి అని రజిత చెప్పిందట. ఇక ఐదు సంవత్సరాలు రాత్రి పగలు టైలరింగ్ చేసి మూడు వేల రూపాయల తన అకౌంట్లో రజిత వేసేది అని కొమరం చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కొమరం చేసిన ఈ కామెంట్లు ప్రేక్షకులను కదిలించింది నట్లు గా మారాయి.
కొమరం ప్రస్తుతం బుల్లితెరపై నవ్వులు నవ్వులు పండిస్తూ ఒక రేంజ్ లో హడావిడి చేస్తున్నాడు. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా అవకాశాలు పొందినట్లు తెలుస్తుంది. ఇక కొమరం తాను సినిమాలో నటిస్తున్న విషయం అప్ డేట్ ఇస్తాడో లేదో చూడాలి.