Jabardasth: ఏంటో ఈమధ్య బుల్లితెర ఆర్టిస్టులంతా రియల్ కపుల్స్ గా మారాలని అనుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది నటులు తోటి నటులతో పరిచయం పెంచుకొని ప్రేమ పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కేవలం వెండితెర నటీనటులే కాకుండా బుల్లితెర నటీనటులు, ఆర్టిస్టులు కూడా ప్రేమలో పడి రీల్ కపుల్స్ కాస్త రియల్ కపుల్స్ గా మారుతున్నారు. ఇప్పటికే బుల్లితెరపై ప్రసారమవుతున్న షో లలో పలువురు ఆర్టిస్టులు తోటి ఆర్టిస్టులతో ప్రేమలో పడ్డారు. రాకేష్- సుజాత, నైనిక – సాయి, ఫైమా- ప్రవీణ్ ఇలా పలువురు నిజంగానే ప్రేమలో ఉన్నారు. అంతేకాకుండా జబర్దస్త్ కమెడియన్స్ నూకరాజు, ఆసియా కూడా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.
వీరిద్దరూ జబర్దస్త్ లో కమెడియన్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమ స్కిట్లతో బాగా సందడి చేస్తూ ఉంటారు. స్కిట్లో భాగంలో కూడా రీల్ కపుల్స్ గా చేస్తూ ఉంటారు. అలా వీరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో సోషల్ మీడియాలో కూడా ఇద్దరు కలిసి రీల్స్ చేస్తూ బాగా సందడి చేస్తూ ఉంటారు. యూట్యూబ్లో ఛానల్స్ క్రియేట్ చేసుకొని ఒకరింటికి ఒకరు వెళ్లి వీడియోలు చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటారు.
గతంలో వీరిద్దరూ ఓ ఇంటర్వ్యూలో కూడా తమ ప్రేమ గురించి బయటపెట్టారు. అయితే తాజాగా నూకరాజు తల్లి పెద్ద షాకే ఇచ్చింది. ఇంతకు అసలు విషయం ఏంటంటే.. తాజాగా జబర్దస్త్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఇక అందులో కమెడియన్స్ అంతా తమ పర్ఫామెన్స్ తో బాగా సందడి చేశారు. చివర్లో నూకరాజు, ఆసియా ఫ్యామిలీ కూడా వేదిక పైకి వచ్చి సందడి చేసినట్టు కనిపించారు. నూకరాజు తండ్రి మాత్రం తన కామెడీతో నవ్వించాడు. అయితే వీళ్లంతా ఒక స్కిట్ చేసినట్లు అది కూడా ఆసియాకు, నూకరాజుకు ఎంగేజ్మెంట్ చేసినట్లు కనిపించింది.
Jabardasth:
ఇక ఆ సమయంలో ఇంద్రజ.. మరి ఏంటి ఇంత దూరం తీసుకొచ్చారు కరెక్ట్ సమయంలో తాంబూలం మార్చుకునే సమయంలో అలా కట్ చేశారు ఏంటి అని అడిగింది. వెంటనే నూకరాజు తల్లి.. మేడం ఇది స్కిట్ వరకే అన్నారు కానీ నిజంగా అయితే ఇది కుదరదు మేడం అంటూ ఆసియాతో పాటు అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఆ ప్రోమో వైరల్ అవ్వగా.. అది చూసిన వాళ్లంతా ఇదంతా ప్రాంక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఎపిసోడ్ లో ప్రాంకా కాదా అనేది చూడాలి.