Jabardasth Shanthi Swaroop: లేడీ గెటప్స్ పై జబర్దస్త్ శాంతి స్వరూప్ కామెంట్స్.. నగ్నంగా వీడియో కాల్స్ అంటూ!

Akashavani

Jabardasth Shanthi Swaroop: జబర్దస్త్ ప్రియులకు కమెడియన్ శాంతి స్వరూప్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షోలో తన కామెడీతో నవ్వులు పండిస్తూ ఉంటాడు. ఏదేమైనా శాంతి స్వరూప్ జబర్దస్త్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన యూట్యూబ్ ఛానల్ లో పంచుకున్న వీడియో తీవ్ర సంచలనానికి దారి తీసింది.

ఇంతకీ అదేమిటంటే?.. శాంతి స్వరూప్ ఆ వీడియోలో జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసి ఫేమ్ తెచ్చుకున్న ఒక వ్యక్తి సర్జరీ చేసుకొని అతడు ట్రాన్స్ జెండర్ గా మారినట్లు వెల్లడించాడు. అంతేకాకుండా జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసే వారు అందరు కూడా ఇలాంటి వారే అని పేర్కొన్నాడు. ఇక జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకొని సోషల్ మీడియాలో పలు ఖాతాలు తెరిచి కొంతమందిని ట్రాప్ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని శాంతి స్వరూప్ తెలిపాడు.

ఇక అంతే కాకుండా నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడుతూ అవి స్క్రీన్ షాట్ తీసి సదరు వ్యక్తిని బెదిరించడం కూడా జరుగుతుందని తెలిపాడు. ఇక ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని శాంతి స్వరూప్ చెప్పుకొచ్చాడు. ఇక ఆ వ్యక్తి అలా చేయడంతో జబర్దస్త్ లో లేడీ గెటప్ వేసే వారందరినీ అలా చిన్నచూపు చూస్తున్నారని శాంతి స్వరూప్ పేర్కొన్నాడు.

Jabardasth Shanthi Swaroop: లేడీ గెటప్స్ పై జబర్దస్త్ శాంతి స్వరూప్ కామెంట్స్.. నగ్నంగా వీడియో కాల్స్ అంటూ!
Jabardasth Shanthi Swaroop: లేడీ గెటప్స్ పై జబర్దస్త్ శాంతి స్వరూప్ కామెంట్స్.. నగ్నంగా వీడియో కాల్స్ అంటూ!

Jabardasth Shanthi Swaroop: వాళ్ళకి ఫీలింగ్స్ లేకపోయినా డబ్బు మీద మోజుతో ఈ పని చేస్తున్నారంట!

అంతేకాకుండా జబర్దస్త్ ద్వారా ఫేమ్ తెచ్చుకొని వాళ్లకు ఎలాంటి ఫీలింగ్స్ లేకపోయినా డబ్బు మీద మోజుతో అలా అడ్డమైన పనులు చేయడానికి సిద్ధమయ్యారు అని శాంతి స్వరూప్ పలు వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్లు విసురుతున్నారు. ఇక మీరు కూడా ఆ వీడియో పై ఒక లుక్కేయండి.

- Advertisement -