Jabardasth: ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ బంగారం అనే అమ్మాయి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో ఇప్పటికే చాలామంది రీల్స్ చేసుకుంటూ.. వీడియో చేసుకుంటూ తెగ ఫేమస్ అయ్యారు. ఒక్క వీడియో తో అతి తక్కువ సమయం లోనే ఒక స్టేజ్ కు చేరుకుంటున్నారు. ఇలాగే ఈ అమ్మాయి కూడా.
బంగారం అంటూ.. ఏడుస్తూ ఈమె చేసిన వీడియో లతో బాగా ఫేమస్ అయిపోయింది. ఈమె చేసిన ఈ వీడియో లతో ఎంతో మంది రీల్స్ కూడా చేస్తున్నారు. నవ్వుతూ ట్రోల్స్ కూడా చేస్తున్నారు. దీంతో ఈమె ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఏకంగా జబర్దస్త్ లో కి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ కొట్టేసిందనీ యూట్యూబ్ విడియో ల ద్వారా తెలిసింది.
వివరాల్లోకి వెళ్తే.. సోషల్ మీడియా లో ట్రెండ్ అయ్యే ప్రతి ఒక్కరూ సెలబ్రిటీలు గా మారిపోతున్నారు. ఆలాంటి వారిని స్టేజ్ పైకి తీసుకొచ్చి జబర్దస్త్ టీం ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. సోషల్ మీడియా సెన్సేషన్ సృష్టిస్తున్న వారిని తీసుకొచ్చి స్కిట్ లు చేయిస్తారు. దాంతో జబర్దస్త్ రేటింగ్ బాగా పెరుగుతుంది.
అలా జబర్దస్త్ ఎప్పుడు కొత్త కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళని ఒక్క స్కిట్ తో సెలబ్రెటీలు గా మార్చేస్తారు. అలా ఎంతో మందికి బుల్లితెర కు పరిచయం చేస్తుంది. ఇలాంటి నైజం తోనే జబర్దస్త్ అండ్ జబర్దస్త్ టీం మెంబర్స్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. తమ మంచితనాన్ని చాటుకున్నారు. అయితే తాజాగా జబర్దస్త్ టీం బంగారం ను స్టేజ్ పైకి తీసుకొచ్చారు.
Jabardasth: జబర్దస్త్ గ్రాండ్ ఫేర్వెల్ వేడుకలో బంగారం ఎంట్రీ..
చలాకి చంటి స్కిట్ లో బంగారం చేస్తుంది. వచ్చే వారం ఎపిసోడ్ లో చలాకి చంటి కు బిగ్ బాస్ వెళ్తున్న కారణంగా గ్రాండ్ ఫేర్వెల్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చలాకి చంటి టీం లో బంగారం ను స్కిట్ లో ఎంటర్ చేశారు. దీనికి సంబంధించి ప్రాక్టీస్ వీడియో లు యూట్యూబ్ లో బాగా వైరల్ అవుతున్నాయి. బంగారం జబర్దస్త్ లో ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తుందో చూడాలి.