Jabardasth: జబర్దస్త్ జడ్జిగా ఎంట్రీ ఇవ్వనున్న హాట్ బ్యూటీ… రేటింగ్స్ బద్దలు కావాల్సిందే!

Akashavani

Jabardasth: బుల్లితెరపై కదా తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రసారమవుతూ ప్రేక్షకులను తమదైన శైలిలో సందడి చేస్తున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి మొదట్లో నాగబాబు రోజా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపించారు. అయితే కొన్ని కారణాల వల్ల నాగబాబు ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలో పలువురిని న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. తాజాగా రోజాకు మంత్రి పదవి రావడంతో ఈమె ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు. ఇక రోజా స్థానంలో కొన్ని రోజుల పాటు పూర్ణ ఇంద్రజ వంటి వారు వచ్చారు.

ఇక జబర్దస్త్ కార్యక్రమంలో ఇంద్రజ జడ్జిగా కొనసాగుతారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ తాజాగా ఈ కార్యక్రమం కోసం మరొక హాట్ బ్యూటీని రంగంలోకి దింపాలనే ఆలోచనలో మల్లెమాల వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలలో గ్లామరస్ పాత్రలో నటించిన హీరోయిన్ శ్రద్ధా దాస్ ను జబర్దస్త్ కార్యక్రమంలోకి తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈమె కనుక ఈ కార్యక్రమంలో కి ఎంట్రీ ఇస్తే ఇక రేటింగ్స్ అమాంతం పెరిగిపోతాయని చెప్పాలి.

Jabardasth: పూర్వవైభవం కోసం మల్లెమాల ప్రయత్నం..

ఇన్ని రోజుల పాటు రోజా ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించడంతో పాటు కమెడియన్స్ చెప్పే డైలాగులను ముందుగానే చెబుతూ వారి పై సెటైర్లు వేస్తూ ఎంతగానో ప్రేక్షకులను సందడి చేశారు. అయితే రోజా వెళ్లిపోవడంతో ఈ కార్యక్రమానికి రేటింగ్స్ పడిపోతాయని చాలామంది భావించారు. రోజాతో పాటు ఈ కార్యక్రమానికి కీలకంగా ఉన్నటువంటి హైపర్ ఆది కూడా గత నెల రోజుల నుంచి ఈ కార్యక్రమంలో కనిపించలేదు. దీంతో జబర్దస్త్ కార్యక్రమం పూర్తిగా పడిపోయిందని అభిమానులు భావించారు.అయితే ఈ కార్యక్రమానికి తిరిగి ఎలాగైనా పూర్వవైభవం తీసుకురావాలని మల్లెమాల వారు పట్టుదలతో ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా హాట్ బ్యూటీ శ్రద్దాదాస్ ను రంగంలోకి దింపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి ఉంది.

- Advertisement -