Jabardasth Varsha: జబర్దస్త్ కామెడీ షో ద్వారా లేడీ కమెడియన్ గా గుర్తింపు పొందిన వర్ష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన వర్ష ఆ తర్వాత సినిమాలు, సీరియల్స్ లో నటించే అవకాశాలు అందుకుంది. వాటి ద్వారా వచ్చిన గుర్తింపుతో జబర్దస్త్ కామెడీ షో నుండి అవకాశం అందుకుంది. జబర్దస్త్ లో ఇమ్మాన్యూయేల్‌కి జంటగా నాన్ స్టాప్ పంచులతో కామెడీ పండించడమే కాకుండా తన గ్లామర్ తో ప్రేక్షకుల ఆకట్టుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే వర్ష అక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
ఇలా తన గ్లామర్ తో కామెడీ పంచులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ లేడీ కమెడియన్ గా గుర్తింపు పొందిన వర్ష తన మంచి మనసు చాటుకొని అందరికీ ఆదర్శంగా నిలిచింది. సాధారణంగా కొంతమంది సెలబ్రిటీలు నిరుపేదలకు సహాయం చేస్తూ ఉంటారు. అలాగే అలాగే వర్ష కూడా తన వాచ్మెన్ కొడుకు చదువు బాధ్యతను తీసుకొని తన మంచి మనసు చాటుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్ష ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంది.
Jabardasth Varsha: ఆ కుర్రాడు చదువు బాధ్యత నాదే…
ఈ క్రమంలో ‘ మీరు ఒక వాచ్ మెన్ కొడుకుని చదివిస్తున్నారని వార్తలు వస్తున్నాయి .. వాటిలో నిజం ఉందా ? అని ప్రశ్నించాడు. దీంతో వర్ష మాట్లాడుతూ.. ” అవును నిజమే . మా వాచ్మెన్ వాళ్ళ అబ్బాయిని చదివిస్తున్నాను.మా వాచ్మెన్ కు ఇద్దరు అబ్బాయిలు. వాళ్లకు చదివించే స్తోమత లేక ఒకరినే చదివిస్తున్నారనే విషయం తెలిసింది. దీంతో మరో అబ్బాయిని నేను చదిస్తనని, ఆ అబ్బాయి చదువు ఖర్చుకయ్యే బాధ్యత నేనే తీసుకుంటానని చెప్పాను. అప్పుడు వాళ్లు చాలా సంతోషపడ్డారు. వాళ్లది కొంచెం పేద కుటుంబం. నా వంతుగా నాకు ఉన్నదాంట్లో ఏదో చిన్న సహాయం చేస్తున్నానని వర్ష సమాధానం చెప్పింది. అయితే వర్ష చేస్తున్న ఈ మంచి పని గురించి తెలిసి నెటిజన్లు శెభాష్ అంటున్నారు.