Jabardasth Varsha: సినీ ఇండస్ట్రీ అంటే ఒక రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో అవకాశాలు అందుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. కొంతమందికి అదృష్టం కొద్ది సులభంగా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కుతాయి. అయితే మరి కొంత మంది మాత్రం ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎన్నో కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రజలు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవాలంటే అది ఒక కల అని చెప్పవచ్చు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలకు అవకాశాలు రావాలంటే అన్ని విషయాలలో కాంప్రమైజ్ అవ్వాలి.
ఇలా కాంప్రమైజ్ అయితేనే అవకాశాలు అందుకొని సక్సెస్ సాధించగలరు. ఇలా పేద కుటుంబం నుండి ఇండస్ట్రీకి వచ్చిన ఎంతోమంది ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు. అలా గుర్తింపు పొందిన వారిలో జబర్దస్త్ వర్ష కూడా ఒకరు. జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గుర్తింపు పొందిన వర్ష సీరియల్స్ లో కూడా నటించింది. సీరియల్స్ కన్నా జబర్దస్త్ ద్వారానే వర్ష కి మంచి గుర్తింపు లభించింది. జబర్దస్త్ వల్ల వచ్చిన గుర్తింపుతో సినిమాలలో నటించాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే మంచి అవకాశాలు అందుకోవటానికి అందరిలాగే వర్ష కూడా కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తోంది.
Jabardasth Varsha: అవకాశాలు రావాలంటే కాంప్రమైజ్ కావాల్సిందే..
ఇండస్ట్రీలో అమ్మాయిలకు అవకాశాలు రావాలంటే వాళ్ళు తప్పకుండా ఎక్స్పోజింగ్ చేయాలి. అలా ఎక్స్పోజింగ్ చేయటానికి అంగీకరిస్తేనే ఇక్కడ అవకాశాలు లభిస్తాయి. గతంలో ఇలా ఎన్నో సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ ఎక్స్పోజింగ్ చేయమని దర్శకనిర్మాతలు డిమాండ్ చేయటంతో వర్ష ఆ సినిమా అవకాశాలు చేజార్చుకుంది. జబర్దస్త్ ద్వారా లేడీ కమెడియన్ గా బాగా గుర్తింపు పొందిన కూడా ఇప్పటికీ సినిమాలలో నటించే అవకాశాల కోసం ఎక్స్పోజింగ్ చేయాలని దర్శకనిర్మాతలు డిమాండ్ చేస్తున్నారని వర్ష తన స్నేహితుల వద్ద తన బాధ చెప్పుకున్నట్లు సమాచారం. ఇలా ఈ జబర్దస్త్ కమెడియన్ కి కూడా ఇబ్బందులు తప్పలేదని తెలుస్తోంది.