Jabardasth: గత 8 సంవత్సరాల నుండి బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది కమెడియన్స్ ఇందులో పాల్గొని తమ స్కిట్లతో బాగా నవ్వించారు. ఇక ఇందులో కామెడీ కంటే ఎక్కువగా డబల్ మీనింగ్ డైలాగులు ఉంటాయని చెప్పవచ్చు.
గత కొన్ని రోజుల నుండి ఈ షో బాగా కాంట్రవర్సీకి దారితీస్తుంది. ఇక లేడి కమెడియన్స్ అడుగుపెట్టి బాగా రచ్చ చేస్తున్నారు. ఇక కామెడీ వరకు ఓకే కానీ లవ్ ట్రాక్ కూడా నడిపిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది కమెడియన్స్ జంటగా మారి బాగా రచ్చ రచ్చ చేస్తున్నారు. హగ్ లతో, కిస్ లతో నానా హంగామా చేస్తున్నారు. ఇప్పటికే ఈ షో నుండి ఫైమా – ప్రవీణ్, నూకరాజు – ఆసియా ఇలా పలు జంటలు ప్రేమ పక్షులుగా మారారు.
ఇక జోర్దార్ సుజాత – రాకింగ్ రాకేష్ కూడా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల నుండి వీరి మధ్య సీక్రెట్ గా లవ్ నడవగా ఆ మధ్యనే బయటపడింది. అంతే కాకుండా వీళ్ళు కూడా తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టారు. ఇక జబర్దస్త్ లో స్కిట్లో భాగంగా వీరు ఇద్దరు రొమాన్స్ లు చేస్తూ రెచ్చిపోతూ ఉంటారు.
Jabardasth:
ముద్దులతో, హగ్ లతో ఎవరు ఉన్నారని కూడా పట్టించుకోకుండా బాగా రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. అయితే అందులో కమెడియన్స్ తమ పర్ఫామెన్స్ లో బాగా సందడి చేశారు. ఇక చివరిలో రాకేష్ సుజాతకు అందరి ముందల రింగు తొడిగి రొమాంటిక్ గా ముద్దు పెట్టాడు. ప్రస్తుతం ఈ ప్రోమో చూసిన వాళ్లంతా ఇదేం కర్మ రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు.