Jacqueline Fernandez అక్రమంగా సంపాదించిందంటూ ప్రభాస్ హీరోయిన్ పై కేసు నమోదు.. ఆస్తులు కూడా జప్తు…

Joythi R

Jacqueline Fernandez ఈమధ్య కాలంలో కొందరు అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలనే ఈ కారణంగా లేనిపోని తలనొప్పులు తెచ్చుకుంటున్నారు. కాగా తాజాగా బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమకు చెందినటువంటి ఓ ప్రముఖ హీరోయిన్ అక్రమ ఆస్తుల సంపాదన విషయంలో పోలీసులకు చిక్కిన విషయం ప్రస్తుతం బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బాగానే ఆకట్టుకుంటోంది. అయితే ఈ అమ్మడికి ఆ మధ్య మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన అటువంటి ఓ ప్రముఖ వ్యాపార వేత్త తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అంతేకాకుండా ఆ వ్యాపారవేత్త ఏకంగా కోట్ల రూపాయల డబ్బు మొత్తం చేసినట్లు పోలీసులు కనుగొన్నారు.

దీంతో ఈ అమ్మడికి సంబంధించిన దాదాపుగా 7 కోట్ల రూపాయల పైగా విలువ చేసే ఆస్తులను జప్తు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ ఆస్తులు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కి ఎలా వచ్చాయనే విషయంపై కూడా పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ని మాత్రం పోలీసులు ఎలాంటి అరెస్టు చేయలేదు. కానీ తొందర్లోనే నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పోలీసుల విచారణకు హాజరు కానుందని బాలీవుడ్ సినీ టౌన్ టాక్ వినిపిస్తోంది.

అయితే నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్వతహాగా శ్రీలంక దేశానికి చెందిన సిటిజన్ అయినప్పటికీ తన చదువు రీత్యా మరియు సినిమా అవకాశాల రీత్యా భారతదేశం లో సెటిల్ అయింది. కాగా ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు నటించిన చిత్రాలతో కంటే ఎక్కువగా వివాదాలతోనే బాగా పాపులర్ అవుతోంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందినటువంటి ఓ ప్రముఖ హీరోతో ప్రేమలో పడిందని అలాగే డేటింగ్ కూడా చేస్తున్నట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా గత కొద్దిరోజులుగా నటి జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఆ హీరో కి సంబంధించిన ఫామ్ హౌస్ లో నే ఎక్కువగా ఉంటోందని కూడా మరికొందరు చర్చించుకుంటున్నారు.

- Advertisement -