Janaki Kalaganaledu July 18 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో జానకి రామను తమ గదిలోకి తీసుకొని వెళ్తుంది. ఇక ఆ సమయంలో జానకి రామతో మరింత ప్రేమతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక తనకు మల్లెపువ్వులు ఇవ్వమంటూ మారం చేస్తుంది. కానీ రామ తను పువ్వులు తేలేదు అని చెప్పటంతో జానకి అంతకుముందే తన అత్తయ్య గారు తెచ్చిన పువ్వులను తీసుకొని రామ దగ్గరికి వస్తుంది.
జానకి కి పువ్వులు పెట్టిన రామ..
పైగా రామను పువ్వులు పెట్టమని అనడంతో రామ కాస్త ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇక జానకి మాత్రం పువ్వులు పెట్టమని.. ముద్దుగా అడుగుతూ ఉంటుంది. ఇక రామ ఇబ్బందిని చూసి కాసేపు వెటకారం చేస్తుంది. ఆ తర్వాత రామ జానకి కోసం స్వయంగా తానే పువ్వులు పెడతాడు. ఆ తర్వాత జానకి అ పువ్వుల వాసన చూడమని అనడంతో వెంటనే రామ ఆ వాసన చూసి రొమాంటిక్ మూడ్ లోకి వెళ్తాడు.
ఇద్దరు మరింత దగ్గరికి అవుతున్న సమయంలో.. వెంటనే రామ ఉలిక్కిపడి దూరం జరుగుతాడు. దాంతో జానకి ఏం జరిగింది అంటూ నవ్వుతూ ఉంటుంది. ఇక రామ తను స్నానం చేసి వస్తాను అని అక్కడి నుంచి పరుగులు తీస్తాడు. దాంతో జానకి మరింత నవ్వుకుంటూ ఉంటుంది. చీకటి పడటంతో ఇద్దరు పక్కపక్కనే పడుకుంటారు.
రామకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్న జానకి..
ఆ సమయంలో జానకి నిద్రపోకుండా రామను తలచుకుంటూ ఉంటుంది. రామ కూడా తను మల్లెపూల వాసన చూసిన సన్నివేశాన్ని గుర్తుకు చేసుకొని.. ఆ వాసన గుర్తుకొస్తుంటే మరోలా ఉంది అని అనుకుంటాడు. ఇక మెల్లగా జానకి ని చూసి తన దగ్గరికి రొమాంటిక్ గా వెళ్లి మళ్లీ దూరం జరుగుతాడు. ఇక జానకి కూడా రామతో రొమాంటిక్ గా చిలిపి చేష్టలు చేస్తుంది.
అలా కాసేపు వారి ఇద్దరి మధ్య సరదా సన్నివేశాలు జరుగుతుంటాయి. ఇక ఉదయాన్నే మల్లిక రాత్రి జానకి కోసం వచ్చిన ఫోన్ గురించి ఆలోచిస్తుంది. సర్టిఫికెట్లు తెమ్మని ఫోన్ ఎందుకు వచ్చిందని.. జానకికా కాదా అని అక్కడున్న అఖిల్, వెన్నెలను అడుగుతుంది. అవి తమ కాలేజ్ నుంచి వచ్చిన ఫోన్ కాదని అంటారు. ఆ సమయంలో భోజనం చేయటానికి గోవిందరాజులు దంపతులు రావడంతో..
Janaki Kalaganaledu July 18 Today Episode: భర్తతో సరసాలు ఆడుతున్న జానకి..
అక్కడ జ్ఞానంబ ముందు జానకి కోసం కాలేజీ నుంచి ఫోన్ వచ్చిందని కొన్ని మాటలు చెప్పటంతో జ్ఞానంబ ఎప్పుడు తోటికోడలు పై ఏడవకుండా నీ గురించి నువ్వు చూసుకో అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత అక్కడికి జానకి, రామ రాగా వెంటనే గోవిందరాజులు జానకిని భోజనం చేయమని అంటాడు. అది చూసి మల్లిక మరింత ఈర్ష్య పడుతుంది. ఆ సమయంలో జానకి తింటూ రామతో సరసాలు ఆడుతూ ఉంటుంది. ఇక రామ మాత్రం తన ఎక్స్ప్రెషన్స్ తో తికమక అవుతుంటాడు.